News November 19, 2025

సింహ ద్వారం వాస్తు ప్రకారం లేకపోతే?

image

మిగతా గృహ నిర్మాణం అంతా వాస్తు ప్రకారం ఉంటే సింహద్వారం ప్రభావం కొద్దిగా తగ్గుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇతర విషయాలన్నీ అనుకూలంగా ఉంటూ సింహ ద్వారం వాస్తు ప్రకారం లేకపోయినా పెద్దగా దోషం ఉండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. ‘వ్యక్తిగత పేరు, జన్మరాశి ఆధారంగా సింహద్వారం ప్రభావాన్ని తెలుసుకోవచ్చు. వాస్తుపరమైన ఇతర సానుకూలతలు ఈ లోపాన్ని అధిగమించడంలో సహాయపడతాయి’ అని సూచించారు. <<-se>>#Vasthu<<>>

Similar News

News March 5, 2026

‘పంచాయతీ’ నిధులపై సీతక్క కీలక ఆదేశాలు

image

TG: పంచాయతీల్లో బిల్లుల చెల్లింపు <<19293089>>వివాదంపై<<>> మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం కింద 2023-24 ఏడాదికిగానూ టైడ్ కాంపొనెంట్ ద్వారా రూ.245 కోట్లు విడుదల చేసిందన్నారు.. వీటితో చేపట్టిన తాగునీరు, పారిశుద్ధ్య పనులకు మాత్రమే గత సర్పంచులకు బిల్లులు చెల్లించవచ్చన్నారు. అలాగే పంచాయతీల్లో అందుబాటులో ఉన్న నిధుల నుంచి మల్టీ పర్పస్ వర్కర్లకు వేతనాలు ఇవ్వాలని సూచించారు.

News March 5, 2026

ఈ ఏడాదిలోనే స్థానిక ఎన్నికలు: CM CBN

image

AP: స్థానిక సంస్థల ఎన్నికలను ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎలక్షన్లలో ఏకపక్ష విజయాలు సాధించేలా నాయకులు, కార్యకర్తలను సన్నద్ధం చేయాలని నిన్న అనంతపురం ప్రజాప్రతినిధుల భేటీలో దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్‌తో పంచాయతీల పదవీకాలం పూర్తవుతుందని, తర్వాత కొన్ని నెలల్లోనే ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సీఎం తెలిపారు.

News March 5, 2026

భావిభారత పౌరులు.. ఊబకాయులు!

image

ప్రాసెస్డ్ ఫుడ్, కూల్‌డ్రింక్స్ తదితర ఆహార అలవాట్లు దేశ భవిష్యత్తు అయిన బాలలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. INDలో 11-17ఏళ్ల మధ్య పిల్లల్లో ఊబకాయం పెరిగి USను దాటి 2వ స్థానానికి చేరినట్లు ఒబెసిటీ అట్లాస్-2026 పేర్కొంది. 5-9 వయసు వారిలో 1.49కోట్లు, 10-19 ఏళ్ల వారిలో 2.6కోట్ల మంది అధిక బరువుతో ఉన్నట్లు చెప్పింది. 74% పిల్లలు శారీరక శ్రమ లేకే బరువు పెరుగుతున్నారు. అటు చైనా తొలిస్థానంలో ఉంది.