News November 17, 2025

ఒకేసారి రెండు సీక్వెల్స్‌లో తేజా సజ్జ!

image

హనుమాన్, మిరాయ్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిన తేజా సజ్జ మరో 2 చిత్రాలను లైన్‌లో పెట్టారు. జాంబిరెడ్డి, మిరాయ్ మూవీల సీక్వెల్స్‌ను సమాంతరంగా పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుల ప్రీప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు సమాచారం. జనవరిలో జాంబిరెడ్డి-2, మార్చిలో మిరాయ్-2ను సెట్స్‌పైకి తీసుకెళ్తారని టాక్. ఈ సినిమాలను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది.

Similar News

News November 17, 2025

ESIC ఆల్వార్‌లో 252 పోస్టులు

image

రాజస్థాన్ ఆల్వార్‌లోని ESIC 252టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 24, 25 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PWBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in/

ఢిల్లీ బ్లాస్ట్‌లో 15మంది మృతి: పోలీసులు

image

ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో NIA, ఢిల్లీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మరోవైపు మృతుల సంఖ్యపై కూడా ఓ స్పష్టతనిచ్చారు. ఇప్పటివరకు ఈ పేలుడు ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అటు సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి సహకరించాడన్న అనుమానంతో కశ్మీరుకు చెందిన అమీర్ రషీద్ అలీని నిన్న NIA <<18306148>>అరెస్టు <<>>చేసిన విషయం తెలిసిందే. అతడిని కశ్మీర్‌కు తీసుకెళ్లి తదుపరి విచారణ కొనసాగించనుంది.