News November 19, 2025
సాధారణ ప్రసవాలు పెంచాలి: కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే సేవల నాణ్యత మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ప్రాంతాల్లో సాధారణ ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణీల ఫాలోఅప్‌ను ఆశా కార్యకర్తలతో సమన్వయం చేయాలని, ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫరల్ అవకాశం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News March 4, 2026
సీఎంఆర్ బియ్యం సేకరణలో జాప్యం వద్దు: అదనపు కలెక్టర్

మిల్లింగ్ చేసిన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బియ్యాన్ని గోదాములకు చేరవేయడంలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో గోడౌన్ మేనేజర్లు, ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మిల్లర్లు బియ్యం తీసుకొచ్చినప్పుడు సకాలంలో లోడింగ్, అన్ లోడింగ్ చేసేలా హమాలీలను సిద్ధంగా ఉంచాలన్నారు.
News March 4, 2026
ఖమ్మం జిల్లాలో నయా మోసం

ఖమ్మం జిల్లాలో నకిలీ మొక్కల ముఠా కలకలం సృష్టిస్తోంది. కేరళ నుంచి నాణ్యమైన మామిడి మొక్కలు తెస్తామంటూ నకిలీ బిల్లులతో రైతులను నమ్మిస్తున్నారు. ఒక్కో మొక్కకు రూ.370 నిర్ణయించి, అడ్వాన్సులు వసూలు చేసి ఉడాయిస్తున్నారు. తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడుకు చెందిన రైతు నుంచి రూ.23 వేలు కాజేశారు. అపరిచిత వ్యక్తులకు ఫోన్ పే, జీపే చేయవద్దని, నకిలీ నర్సరీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
News March 4, 2026
ఖమ్మంలో ఈ-నామ్ 2.0 సేవలు షురూ

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఈ-నామ్ 2.0’ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. పంట నాణ్యత తనిఖీకి ఏఐ (AI) సాంకేతికతను వాడుతున్నారు. బిడ్డింగ్ ధర, తూకం, కమీషన్ వివరాలు నేరుగా రైతు ఫోన్‌కు మెసేజ్ వస్తాయి. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా, రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వీలుంటుందని మార్కెట్ అధికారులు వెల్లడించారు.


