News November 19, 2025
RGM: సమ్మక్క జాతర ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్న సమ్మక్క జాతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం పరిశీలించారు. గోదావరిఖని పట్టణ శివారులోని గోదావరి బ్రిడ్జి వద్ద, అంతర్గాం మండలం గోలివాడ జాతర నిర్వహణ ఏర్పాట్లను ఆయన అధికారులతో కలిసి సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతర విజయవంతానికి అన్ని విభాగాల అధికారులు సమాయత్తంగా ఉండాలన్నారు.
Similar News
News March 28, 2026
కృష్ణా: పదో తరగతి బయోలాజికల్ సైన్స్ పరీక్ష ప్రశాంతం

పదో తరగతి పరీక్షల్లో భాగంగా శనివారం బయోలాజికల్ సైన్స్ పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని 148 కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగిందని డీఈవో యూవీ సుబ్బారావు తెలిపారు. 21,716 మంది విద్యార్థులకు గాను 21,408 మంది హాజరయ్యారన్నారు. 308 మంది గైర్హాజరు కాగా హాజరు శాతం 98.18% నమోదైందన్నారు. డీఈవోగా తాను 4 కేంద్రాలను తనిఖీ చేయగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ 32 కేంద్రాలను తనిఖీ చేశాయన్నారు.
News March 28, 2026
ఉమ్మడి విశాఖ జడ్పీ సమావేశం: ప్రజా సమస్యలపై చర్చ

పాడేరు: ఉమ్మడి విశాఖ జడ్పీ సర్వసభ్య సమావేశం శనివారం చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరిగింది. ఈ కీలక భేటీకి అల్లూరి, అనకాపల్లి, విశాఖ జిల్లాల కలెక్టర్లు దినేష్ కుమార్, విజయ కృష్ణన్, హరేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. స్థానిక ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు వారు బదులిస్తూ, ముగ్గురు అధికారుల సమన్వయంతో త్వరితగతిన పరిష్కారాలు చూపుతామని స్పష్టం చేశారు.
News March 28, 2026
మోదీ-ట్రంప్ కాల్‌లో ఎలాన్ మస్క్ లేరు: కేంద్రం

ప్రధాని మోదీ, US ప్రెసిడెంట్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ కాల్‌లో ఎలాన్ మస్క్ పాల్గొన్నట్లు వచ్చిన వార్తలను కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి ఖండించారు. ఈ నెల 24న మోదీ, ట్రంప్ మధ్య మాత్రమే టెలిఫోన్ సంభాషణ జరిగిందని స్పష్టం చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై వారు మాట్లాడుకున్నారని తెలిపారు.


