News November 19, 2025
శ్రీకాకుళం: స్టాప్ మీటింగ్‌లో కుప్ప కూలిన అధ్యాపకుడు

శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర కళాశాల తెలుగు అధ్యాపకుడు పప్పల వెంకటరమణ మంగళవారం కళాశాలలో స్టాప్ మీటింగ్ జరుగుతుండగా కుప్ప కూలిపోయాడు. మీటింగ్‌లో ఒక్కసారిగా కింద పడిపోవటంతో స్పందించిన తోటి అధ్యాపకులు శ్రీకాకుళంలోని డే అండ్ నైట్ సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంకటరమణ పొందూరు మండలం ధర్మపురం కాగా, శ్రీకాకుళంలోని PM కాలనీలో నివాసం ఉంటున్నారు.
Similar News
News March 10, 2026
శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన కార్తీక్ మృతి

ఎచ్చెర్ల ప్రధాన రహదారిలోని సర్వీస్ రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన ద్విచక్ర వాహనం <<19333513>>బోల్తా<<>> ఘటనలో అరసవిల్లి కార్తీక్ (18) గాయపడిన విషయం తెలిసిందే. తన స్నేహితుడు మధు చరణ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా రహదారిపై మొక్కజొన్న పంట టార్పాలిన్ కప్పి ఉండడంతో అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. అతడిని హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు.
News March 10, 2026
SKLM: ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 53 వినతులు

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదికకు 53 వినతులు వచ్చాయి. ప్రజలు సమర్పించిన అర్జీలపై చట్ట, న్యాయపరమైన అంశాలను పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేయాలని ఏఎస్‌పీ రమణ పోలీస్ అధికారులను ఆదేశించారు. భూతగాధలు, కుటుంబ తగాదాలు, ఆస్తి పంపకాలు సంబంధించిన ఫిర్యాదులను ప్రజలు సమర్పించారు.