News November 19, 2025

కలెక్టర్ హెచ్చరిక

image

ప్రతి సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజలు ఇచ్చే దరఖాస్తులను ఆన్లైన్ చేసి వారికి రసీదు ఇవ్వాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో తహశీల్దార్లతో పలు రెవెన్యూ అంశాలపై రివ్యూ నిర్వహించారు. పీజీఆర్ఎస్ అర్జీలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు.

Similar News

News March 14, 2026

వనపర్తి జిల్లాలో భానుడి భగభగ.. 39.3°C నమోదు

image

వనపర్తి జిల్లాలో ఎండలు ముదురుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కానాయిపల్లిలో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వీపనగండ్ల, దగడలో 39.0°, గోపాల్‌పేటలో 38.9°గా నమోదయ్యాయి. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

News March 14, 2026

హార్ముజ్ దాటిన భారత నౌకలు.. మొత్తం 86వేల టన్నుల LPG

image

భారత్‌కు చెందిన మరో LPG క్యారియర్ హార్ముజ్ జలసంధిని దాటినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 46వేల మెట్రిక్ టన్నుల LPGతో ‘నందా దేవి’ అనే నౌక వస్తోందని, దీనికి ఇండియన్ నేవీ ఎస్కార్ట్ కల్పిస్తోందని పేర్కొన్నాయి. మరో రెండు రోజుల్లో ముంబై లేదా కాండ్లా(గుజరాత్) ఓడరేవుకు చేరుకోనుంది. మరో షిప్ ‘శివాలిక్’ నిన్నే హార్ముజ్‌ను దాటిందని, అందులో 40వేల టన్నుల LPG ఉందని CNN NEWS 18 తెలిపింది.

News March 14, 2026

BIG SCREENపై ఆదిలాబాద్ యువకులు

image

ఇటీవల విడుదలైన ఓ చిత్రంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఐదుగురు యువకులు మెరిశారు. గుడిహత్నూర్ రైతు బిడ్డ అనికేత్ గిట్టేతో పాటు పట్టణానికి చెందిన జగత్ ప్రతాప్, నిహల్ సింగ్, ధీరజ్ జాట్, ప్రవీణ్ జోష్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రంలో కొద్ది నిమిషాల పాటు వీరు వెండితెరపై కనిపించి అలరించారు. జిల్లా యువత ప్రతిభను చాటడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.