News November 19, 2025

రేపు పుట్టపర్తికి వస్తున్నా: PM మోదీ

image

సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు తాను రేపు పుట్టపర్తికి వస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. సమాజ సేవ, ఆధ్యాత్మికత కోసం బాబా చేసిన కృషి తరతరాలకు మార్గదర్శకమని ప్రధాని పేర్కొన్నారు. గతంలో బాబాతో తనకు అనేక సందర్భాల్లో సంభాషించే అవకాశం లభించిందని, ఆ అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

Similar News

News March 5, 2026

నల్గొండ: మళ్లీ 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ

image

NLG జిల్లాలోని 5,38,650 రేషన్ కార్డుదారులకు ఏప్రిల్, మే, జూన్ నెలల బియ్యాన్ని ఏప్రిల్‌లోనే పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. గోదాముల్లో నిల్వలు పెరగడం, రాబోయే CMR సేకరణకు స్థలం కేటాయించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 23,700 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 1,051 రేషన్ షాపులకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News March 5, 2026

బెంబేలెత్తుతున్న శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలు

image

మధ్యాహ్నం ఎండలు, రాత్రి ఉక్కపోతతో శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజు రోజుకూ ఎండ తీవ్రత పెరిగిపోతోంది. ఈనెల 1న దేశంలోనే అత్యధికంగా అనంతపురంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 38.4 డిగ్రీలు నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. బుధవారం పుట్టపర్తి మండలంలో 35.21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ధర్మవరం, కదిరి మండలాల్లో 34.21, హిందూపురం మండలంలో 34.19 డిగ్రీలు నమోదయ్యాయి.

News March 5, 2026

సంగారెడ్డి: తాను మరణించి ఆరుగురికి ప్రాణం పోశారు!

image

తాను మరణించిన ఆరుగురికి రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంబాదాస్ ప్రాణం పోశారు. అమీన్‌పూర్‌ బృందావన్ టీచర్స్ కాలనీలో ఉంటున్న అంబాదాస్(63) అధిక రక్తపోటుతో బాధ పడేవారు. ఫిబ్రవరి 28న ఒక్కసారిగా కుప్పకూలగా నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. మార్చి 3న బ్రెయిన్ డెడ్ కావడంతో ఆర్గాన్స్‌ను డొనేట్ చేసేందుకు ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకున్నారు. కుటుంబ నిర్ణయం స్ఫూర్తిదాయకం అని సజ్జనార్ ట్వీట్ చేశారు.