News November 19, 2025
నీట్, జేఈఈ శిక్షణ ఇవ్వాలి: కలెక్టర్ స్నేహ శబరీష్

ప్రభుత్వ జూనియర్, గురుకుల కళాశాలల విద్యార్థులకు నీట్, జేఈఈ, ఎంసెట్ వంటి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచేలా కోచింగ్ ఇవ్వాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఇంటర్మీడియట్, సంక్షేమ విద్యాలయాల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 24, 2026
నియోజకవర్గాల పునర్విభజనపై ఎవరి లెక్కలు వారివే.!

కడప జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. భౌగోళిక, జనాభా, ఓటర్ల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరగొచ్చని చర్చ సాగుతోంది. దీనిపై రాజకీయ నాయకులు, అనుచరులు, ప్రజలు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా లెక్కలు తీస్తున్నారు. కడప-2,84,548, ప్రొద్దుటూరు-2,48,324, జమ్మలమడుగు-2,42,749, పులివెందుల-2,30,235, బద్వేల్-2,20,804, మైదుకూరు-2,12,380, కమలాపురం-2,05,019 ఓటర్లు ఉన్నారు.
News March 24, 2026
బూత్ లెవల్ ఏజెంట్లను వెంటనే నియమించుకోవాలి: కలెక్టర్

ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయ పార్టీలు వెంటనే బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ కే. హేమావతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలని, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ఆమె కోరారు.
News March 24, 2026
సిరిసిల్ల: అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

అప్పుల బాధ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వీర్నపల్లి మండలం శాంతినగర్‌కు చెందిన గూగులోతు గోపాల్(36) శనివారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు తీరక, మనస్తాపంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


