News November 19, 2025
నీట్, జేఈఈ శిక్షణ ఇవ్వాలి: కలెక్టర్ స్నేహ శబరీష్

ప్రభుత్వ జూనియర్, గురుకుల కళాశాలల విద్యార్థులకు నీట్, జేఈఈ, ఎంసెట్ వంటి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచేలా కోచింగ్ ఇవ్వాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఇంటర్మీడియట్, సంక్షేమ విద్యాలయాల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 24, 2026
దోర్నాల: సూసైడ్‌కు యత్నించిన యువకుడు.. చివరికి

యర్రగొండపాలెంకి చెందిన ఓ యువకుడు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చి దోర్నాల వైపు వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. SI తన సిబ్బందితో కలిసి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఆ యువకుడిని గుర్తించారు. కౌన్సిలింగ్ ఇచ్చి అతని కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు.
News March 24, 2026
సుప్రీం తీర్పు సరే.. క్రైస్తవంలో చేరారని నిరూపించేదెలా?

క్రైస్తవంలోకి మారిన వారు SC హక్కులు పొందలేరని సుప్రీంకోర్టు <<19462779>>తీర్పు<<>> ఇచ్చింది. అయితే బాప్టిజం సర్టిఫికెట్ లేకుండా క్రైస్తవాన్ని స్వీకరించినట్లు నిరూపించడం ఎలాగనేది అతిపెద్ద ప్రశ్న. ఎందుకంటే చర్చికి వెళ్లడం, పేర్లు మార్చుకోవడంతో మతం మారినట్లు చెప్పలేం. అలాంటి చట్టాలేవీ దేశంలో అమలులో లేవు. పలు రాష్ట్రాల్లో మత నిరోధక బిల్లులున్నా వాటి పాత్ర పరిమితం. ఈ అంశంపై విధివిధానాల రూపకల్పన అవసరం. ఏమంటారు?
News March 24, 2026
వనపర్తి: మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ!

వనపర్తి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవనంలోని RSETI లో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. ఆసక్తి గలవారు SSC మెమో, ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్, 3 ఫొటోలతో ఈనెల 28లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వివరాలకు 8522088978 నంబర్‌ను సంప్రదించవచ్చు.


