News November 19, 2025
రేపు హైదరాబాదుకు సిట్ బృందం..?

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ బృందం మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని విచారించనున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు జారీ చేయగా 20న హైదరాబాదులో విచారించేందుకు 19న సిట్ బృందం వెళ్లే అవకాశం ఉంది. రెండు రోజులపాటు విచారణ చేసేఅవకాశం ఉన్నట్లు సమాచారం.
Similar News
News March 4, 2026
ADB: పెళ్లిళ్లలో కట్న కానుకల నిషేధం.. ఏకమైన గ్రామస్థులు

గ్రామస్థుల ఐక్యత ఒకరికి ఆసరా అయ్యింది. ఇంద్రవెల్లి మండలం దోడంద గ్రామంలో పెళ్లిళ్లలో కట్న కానుకలు నిషేధించడంతో గ్రామస్థులంతా తోచినంత పొదుపు చేసుకుని ఇటీవల నిశ్చితార్థమైంది. కొడప రేణుక కుటుంబానికి గ్రామస్థులంతా కలిసి రూ. 21,000 వేల ఆర్థిక సహాయంగా అందజేసినట్లు గ్రామ పటేల్ తుంరం మల్కు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.
News March 4, 2026
నల్గొండ: కళాకారులకు వరం.. పీఎం విశ్వకర్మ మేళా!

చేతివృత్తుల కళాకారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈనెల 6 నుంచి 8 వరకు ఎస్బీఆర్ (SBR) ఫంక్షన్ హాల్‌లో ‘పీఎం విశ్వకర్మ ట్రేడ్ ఫెయిర్’ నిర్వహిస్తోంది. ఎంఎస్ఎంఈ (MSME) ఆధ్వర్యంలో జరిగే ఈ మూడు రోజుల ప్రదర్శనలో లబ్ధిదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి, విక్రయించుకోవచ్చు. ఈ అవకాశాన్ని కళాకారులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
News March 4, 2026
విశాఖ కలెక్టరేట్‌లో జిల్లా ఎలక్ట్రిసిటీ కమిటీ సమావేశం

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ శ్రీభరత్ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో జరిగిన విద్యుత్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ చోరీలను అరికట్టాలని, ఆర్‌డీఎస్‌ఎస్ అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేసి వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.


