News November 19, 2025

HYD: ఈనెల 19న పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు కౌన్సిలింగ్‌

image

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ ఈనెల 19న జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరు కావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News March 20, 2026

ఇచ్ఛాపురంలో యాక్సిడెంట్.. యువకుడి మృతి

image

ఇచ్ఛాపురంలో గురువారం రాత్రి జరిగిన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బెల్లుపడ గ్రామానికి చెందిన ఉప్పాడ కుమార్ మృతి చెందారు. బైక్‌పై వస్తున్నా కుమార్ ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కుమార్ బైక్ నుజ్జునుజ్జయిందని, తలకు బలమైన గాయం తగలడంతో స్థానికులు చూసే సరికి మృతిచెంది ఉన్నాడని ఎస్ఐ ముకుందరావు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News March 20, 2026

రోడ్లపై ఉమ్మినందుకు ₹3.44 లక్షల ఫైన్!

image

లండన్‌లోని రోడ్లపై పాన్ ఉమ్మినందుకు ఇద్దరు భారతీయులకు అధికారులు ₹3.44 లక్షల జరిమానా విధించారు. గతేడాది జూన్‌లో కింగ్స్‌బరీ రోడ్డులో అక్షిత్ కుమార్, నార్త్ వెంబ్లే స్టేషన్ వద్ద హితేశ్ పటేల్ ఉమ్మేశారు. దీంతో వారికి 100 పౌండ్ల(₹12,533) చొప్పున అధికారులు స్పాట్ ఫైన్ వేశారు. కానీ వాళ్లు చెల్లించకపోవడంతో 1,391 పౌండ్ల(₹1.72 లక్షలు) చొప్పున ఫైన్ వేస్తూ బ్రెంట్ కౌన్సిల్‌ ఆదేశాలిచ్చింది.

News March 20, 2026

హార్ముజ్ జలసంధిలో టోల్ వసూలు.. ఇరాన్ ప్లాన్!

image

ప్రపంచ క్రూడాయిల్ సరఫరాలో అతి కీలకమైన హార్ముజ్ జలసంధిని ఉపయోగించుకుని ఆర్థికంగా లాభపడాలని ఇరాన్ ప్లాన్ వేస్తోంది. ఈ మార్గంలో వెళ్లే నౌకల నుంచి టోల్ వసూలు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం చట్టం తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు ఇరాన్ మీడియా తెలిపింది. జలసంధిలో సముద్ర రవాణా భద్రత వల్ల లబ్ధి పొందుతున్న దేశాలు ఇరాన్‌కు ఫీజులు, పన్నులు చెల్లించాలని ఓ చట్ట సభ్యుడు చెప్పినట్లు పేర్కొంది.