News November 19, 2025

మత్తు పదార్థాల జోలికి యువత పోవద్దు: సీపీ సన్‌ప్రీత్ సింగ్

image

యువత మత్తు పదార్థాల జోలికి పోవద్దని వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ మెడికల్ విద్యార్థులకు సూచించారు. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Similar News

News March 5, 2026

నామినేషన్ వేసిన సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

image

తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన వారిద్దరూ తమకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీకి, ఏఐసీసీ పెద్దలకు, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి పాటుపడతానని సింఘ్వీ వ్యాఖ్యానించారు.

News March 5, 2026

జిమ్‌లో వ్యాయామం చేస్తూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

image

ఖమ్మం జిల్లాకు చెందిన నాగండ్ల అనిల్ చౌదరి (36) హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మృతి చెందారు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్ నం.36లోని ఎస్బో జిమ్‌లో ఈ నెల 3 మధ్యాహ్నం వ్యాయామం పూర్తి చేసుకున్న అనిల్ చౌదరి వాష్ రూమ్‌కు వెళ్లిన సమయంలో అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News March 5, 2026

సంగారెడ్డి: పదో తరగతి హాల్‌ టికెట్లు విడుదల

image

పదో తరగతి వార్షిక పరీక్షల హాల్‌ టికెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం గురువారం విడుదల చేసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. వెబ్‌సైట్‌ www.bse.telangana.gov.in నుంచి విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అన్నారు. ఈసారి విద్యార్థుల సౌకర్యార్థం వాట్సాప్‌ సేవలు కూడా అందుబాటులో ఉంచామని, 80969 58096 వాట్సాప్‌ నంబర్‌పై సేవలు పొందవచ్చని పేర్కొన్నారు.