News November 19, 2025

SRCL: ఎస్సీ వసతి గృహాల వస్తువులకు టెండర్లు

image

జిల్లాలోని ఎస్సీ వసతి గృహాల విద్యార్థులకు అందించాల్సిన వస్తువులు, పరికరాల సరఫరా కోసం పిలిచిన టెండర్లను మంగళవారం ఓపెన్ చేశారు. కలెక్టరేట్‌లో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ సమక్షంలో ఈ టెండర్లను పరిశీలించారు. జామెట్రీ బాక్స్, స్కేల్, వరల్డ్ మ్యాప్, స్టడీ చైర్, దుప్పట్లు, సీసీ కెమెరాలు మొదలైన వస్తువుల సరఫరాకు వచ్చిన దరఖాస్తులను ఆమె పరిశీలించారు.

Similar News

News March 11, 2026

కాకతీయ యూనివర్సిటీకి CPGET-2026 నిర్వహణ బాధ్యతలు

image

రాష్ట్రంలో పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్ఠాత్మక CPGET-2026 పరీక్షల నిర్వహణ బాధ్యతలు వరంగల్‌లోని కేయూకు దక్కాయి. గత కొన్నేళ్లుగా ఈ పరీక్షలను హైదరాబాద్ OU నిర్వహిస్తోంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు అధికారిక ఉత్తర్వులు జారీ చేసి బాధ్యతలను కేయూకు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించనున్నారు.

News March 11, 2026

జాగ్రత్త.. లేపేస్తాం: ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్

image

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. హార్ముజ్ జలసంధిలో చమురు రవాణాను అడ్డుకుంటే ఇరాన్‌ను మరింత బలంగా దెబ్బతీస్తామని ట్రంప్ హెచ్చరించగా.. దీనిపై ఇరాన్ భద్రతా మండలి చీఫ్ అలీ లారిజానీ ఘాటుగా స్పందించారు. ‘మీకంటే గొప్పవారే ఇరాన్‌ను ఏమీ చేయలేకపోయారు. జాగ్రత్త.. లేదంటే మీరే లేకుండాపోతారు’ అని ట్రంప్‌ను హెచ్చరించారు.

News March 11, 2026

మంచిర్యాల: పదో తరగతి పరీక్షలకు ఎన్ని సెంటర్లంటే..

image

ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 9708మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో అబ్బాయిల సంఖ్య-4,896
అమ్మాయిల సంఖ్య- 4,807
పరీక్ష కేంద్రాల సంఖ్య-48
చీఫ్ సూపర్డెంట్ల సంఖ్య-48 డిపార్ట్మెంటల్ అధికారుల సంఖ్య-58
ఇన్విజిలేటర్ల సంఖ్య-460
విద్యార్థులు పరీక్షలు ప్రశాంతంగా రాసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు.