News November 19, 2025
పార్వతీపురంలో ఈనెల 28న ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల గ్రీవెన్స్

ఈనెల 28వ తేదీ శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఈనెల 28న కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 11.00 గంటలకు గ్రీవెన్స్ ప్రారంభమవుతుందన్నారు. సమస్యలను ఈ గ్రీవెన్స్‌లో దరఖాస్తుల రూపంలో అందజేయవచ్చని పేర్కొన్నారు.
Similar News
News March 16, 2026
కొత్తగూడెం: సింగరేణి ఉద్యోగులకు 18న రంజాన్ అడ్వాన్స్

సింగరేణిలో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులకు రంజాన్ అడ్వాన్స్‌ను ఈనెల 18న చెల్లించనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. పండుగ వేళ ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా ఈ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. నిబంధనల ప్రకారం.. సంస్థలోని శాశ్వత ఉద్యోగులకు రూ.25,000, ఇతర కేటగిరీ ఉద్యోగులకు రూ.12,500 చొప్పున అడ్వాన్స్ అందజేయనున్నారు. ఈ నిర్ణయంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News March 16, 2026
నందిని సిధారెడ్డికి సాహిత్య అకాడమీ అవార్డు

TG: ప్రముఖ రచయిత నందిని సిధారెడ్డి రచించిన ‘అనిమేష’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 24 భారతీయ భాషలలో ఈ సాహిత్య అవార్డులను అకాడమీ ప్రకటించింది. ‘అనిమేష’తో పాటు ఆయా భాషల్లోని రచయితల సాహిత్య పుస్తకాలకు అవార్డులను ప్రకటించింది. కొవిడ్ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న వేదన, భయం, సంఘర్షణలను ప్రతిబింబించే కావ్యమిది. అప్పటి పరిస్థితులను అక్షరరూపంలో కళ్లకు కట్టేలా రచయిత ఆవిష్కరించారు.
News March 16, 2026
HYD బిర్యానీ హోటళ్లలో భారీ పన్ను ఎగవేత

HYDలోని ప్రముఖ బిర్యానీ హోటళ్లలో జరుగుతున్న భారీ పన్ను ఎగవేత వెనుక గుండె తరుక్కుపోయే నిజాలు వెలుగుచూశాయి. యజమానులు కేవలం సాఫ్ట్‌వేర్‌తో బిల్లులు డిలీట్ చేయడమే కాకుండా LPG గ్యాస్ సిలిండర్ల మార్పిడి పేరుతో దోపిడీకి పాల్పడ్డారు. కస్టమర్ల నుంచి వసూలు చేసిన పన్నును ప్రభుత్వానికి కట్టలేదు. సామాన్యుడి సొమ్మును సాఫ్ట్‌వేర్ ముసుగులో మింగేస్తున్న ఈ దోపిడీదారులు ఇప్పుడు చట్టం ఉచ్చులో చిక్కుకున్నారు.


