News November 19, 2025

సీఎం ప్రజావాణిలో 298 దరఖాస్తులు

image

ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 298 దరఖాస్తులు వచ్చాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 90, రెవెన్యూ శాఖకు 54, ఇందిరమ్మ ఇండ్ల కోసం 90, మున్సిపల్ శాఖకు 17, ప్రవాసి ప్రజావాణికి 2 దరఖాస్తులు, ఇతర శాఖలకు సంబంధించి 45 దరఖాస్తులు అందినట్లు సీఎం ప్రజావాణి ఇన్‌ఛార్జ్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ వెల్లడించారు.

Similar News

News March 11, 2026

డ్రగ్స్ నెట్‌వర్క్‌కు ‘ఈగిల్’ షాక్.. ఏఐతో నేరగాళ్ల గుట్టు రట్టు!

image

ఇక డ్రగ్స్ మాఫియా ఆటలు సాగవు..! గంజాయి, డ్రగ్స్ దందా చేసే కేటుగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేందుకు తెలంగాణ ‘ఈగిల్ ఫోర్స్’ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. నేరగాళ్ల ఫోన్లు, కంప్యూటర్లలోని డేటాను సెకన్లలో చిదిమేసేందుకు అత్యాధునిక ‘ఏఐ డిజిటల్ ఫోరెన్సిక్’ సిస్టమ్‌ను తీసుకొస్తోంది. వాట్సాప్ చాట్లు, సోషల్ మీడియా గుట్టును విప్పడమే కాకుండా.. AIతో అనుమానిత సంభాషణలను ఇట్టే పట్టేస్తుంది.

News March 11, 2026

నెక్లెస్ రోడ్‌ నీరా కేఫ్ భవనం లీజుకు టెండర్ల ఆహ్వానం

image

నెక్లెస్ రోడ్ వద్ద ఉన్న నీరా కేఫ్ భవనాన్ని లీజుకు ఇవ్వడానికి తెలంగాణ TD టాపర్స్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ టెండర్లను ఆహ్వానించింది. ఈ భవనంలో నీరా ప్రాసెసింగ్ యూనిట్, బ్యాంకెట్ హాల్‌తో పాటు 7వాణిజ్య దుకాణాలు ఉన్నట్లు మేడ్చల్ జిల్లా BC అభివృద్ధి శాఖ అధికారి ఝాన్సీరాణి తెలిపారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో గౌడ వృత్తికి చెందిన సంఘాల నుంచి నిర్దిష్ట నిబంధనలు, మేరకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు.

News March 11, 2026

యుద్ధం సెగలు.. HYDలో పెరిగిన ధరలు

image

మిడిలీస్ట్ యుద్ధం మంటలతో IT కారిడార్ హాస్టళ్లలో ఉండేవారికి, నిరుద్యోగుల కడుపు కాలుతోంది. యుద్ధ నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ సరఫరా తగ్గడంతో చిన్న హోటళ్లలో ప్లేట్ టిఫిన్‌పై ₹5 వరకు పెంచేశారని ప్రజలు చెబుతన్నారు. దీనికి తోడు మధ్యాహ్నానికే గ్యాస్ అయిపోవడం, షట్టర్ కట్టేస్తుండటంతో 2 పూటలు కడుపు కాలుతోందంటున్నారు. హాస్టళ్లలో బేసిక్ మీల్స్ ఇవ్వాలని హాస్టళ్ల <<19350638>>అసోసియేషన్<<>> నిర్ణయించింది. దీనిపై మీ కామెంట్