News November 19, 2025

తరాలకు మార్గదర్శకంగా సత్యసాయి బాబా జీవితం: మోదీ

image

AP: రేపు పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఎదురుచూస్తున్నానని పీఎం మోదీ ట్వీట్ చేశారు. సమాజ సేవ, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం సత్యసాయి జీవితం, చేసిన ప్రయత్నాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు. సత్యసాయి బాబాతో సంభాషించడానికి ఆయన నుంచి నేర్చుకోవడానికి కొన్ని అవకాశాలు తనకు లభించాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే సచిన్ పుట్టపర్తికి చేరుకున్నారు.

Similar News

News March 11, 2026

ఆ మందులతో లివర్ డ్యామేజీ: అధ్యయనం

image

ఆయుర్వేదం, ఇతర ప్రత్యామ్నాయ మందుల వాడకంపై తాజా అధ్యయనం షాకింగ్ విషయాలను వెల్లడించింది. 386 రకాల ఉత్పత్తులను పరీక్షించగా 27.7% మందుల్లో స్టెరాయిడ్స్, 31.3% ఉత్పత్తుల్లో జంతు సంబంధిత వ్యర్థాలు ఉన్నట్లు ఇందులో తేలినట్లు ‘ఫ్రాంటియర్స్ ఇన్ గ్యాస్ట్రోఎంటరాలజీ’ ప్రచురించింది. వీటిలో సీసం, ఆర్సెనిక్ వంటి భార లోహాలు మోతాదుకు మించి ఉన్నాయని, వీటివల్ల 39% మందిలో కాలేయం పాడై మరణ ముప్పు పెరుగుతుందని తెలిపింది.

News March 11, 2026

ట్రంప్ రిఫైనరీ ప్రాజెక్టుకు రిలయన్సే ఎందుకు?

image

టెక్సాస్ రిఫైనరీ ప్రాజెక్టులో <<19350969>>రిలయన్స్‌<<>>ను పార్ట్‌నర్‌గా చేర్చుకోవడానికి కారణం దాని ‘నెల్సన్ కాంప్లెక్సిటీ ఇండెక్స్’ (NCI). ప్రపంచంలో అధిక NCI (21.1) ఉన్న రిఫైనరీ జామ్‌నగర్. అంటే ఇది చౌకగా లభించే భారీ ముడి చమురును సైతం అత్యంత నాణ్యమైన ఇంధనంగా మార్చగలదు. ఈ స్థాయి సామర్థ్యం వరల్డ్‌లో మరే రిఫైనరీకి లేదు. వెనిజులా నుంచి వచ్చే చమురును శుద్ధి చేయడానికి రిలయన్స్ వంటి కాంప్లెక్స్ రిఫైనరీ అవసరం.

News March 11, 2026

ఇండియాకు వస్తున్న షిప్‌పై ఇరాన్ దాడి!

image

గుజరాత్‌కు వస్తున్న థాయి‌లాండ్‌ కార్గో షిప్‌ ‘మయూరీ నారీ’పై ఇరాన్ దాడికి దిగింది. UAEలోని ఖలీఫా పోర్టు నుంచి బయల్దేరిన కాసేపటికే హార్ముజ్ జలసంధి వద్ద అటాక్ చేసింది. ఇది తమ పనేనని తాజాగా ధ్రువీకరించింది. అందులోని 20 మంది సిబ్బందిని కాపాడగా, ముగ్గురు మిస్ అయ్యారు. ప్రేషియస్ షిప్పింగ్ కంపెనీకి చెందిన ఈ నౌక కండ్లా పోర్టు(గుజరాత్)కు వస్తోంది.