News November 19, 2025
అల్ ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ అరెస్ట్

హరియాణా ఫరిదాబాద్‌లోని అల్ ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ జావెద్ అహ్మద్ సిద్ధిఖీని మనీలాండరింగ్ కేసులో ED అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ పేలుడు, టెర్రర్ మాడ్యూల్ కేసు దర్యాప్తులో భాగంగా నిన్న వర్సిటీ సహా 25 ప్రాంతాల్లో ED సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించింది. ఈక్రమంలోనే ఆయనను అదుపులోకి తీసుకుంది. కాగా వర్సిటీలో పనిచేసిన ముగ్గురు డాక్టర్లకు ఉగ్ర కుట్రతో సంబంధాలున్నాయన్న కోణంలో విచారణ జరుగుతోంది.
Similar News
News March 13, 2026
మూసీ పునరుద్ధరణను గుడ్డిగా వ్యతిరేకించడం కరెక్టా: రేవంత్

TG: చరిత్రలో నగరాలన్నీ నదీ పరీవాహక ప్రాంతాల్లోనే అభివృద్ధి చెందాయని CM రేవంత్ రెడ్డి అన్నారు. మనం కూడా అభివృద్ధిని అందుకోవాలనే మూసీ పునరుజ్జీవానికి శ్రీకారం చుట్టామన్నారు. అలాంటి ప్రాజెక్టును గుడ్డిగా వ్యతిరేకించడం కరెక్టా అని ప్రతిపక్షాలనుద్దేశించి ప్రశ్నించారు. BRS, BJP దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని నిలదీశారు. మూసీ పునరుద్ధరణ ప్రాజెక్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో CM ఈ వ్యాఖ్యలు చేశారు.
News March 13, 2026
వివాదంలో మరో IPL జట్టు

హండ్రెడ్ లీగ్‌లో PAK బౌలర్ అబ్రార్‌ను తీసుకొని <<19368622>>సన్‌రైజర్స్<<>> విమర్శలు ఎదుర్కొంటుండగా తాజాగా మరో IPL జట్టు వివాదంలో చిక్కుకుంది. CSKపై సన్ టీవీ రూ.కోటికి దావా వేసింది. జైలర్, జైలర్-2, కూలీ సినిమాల్లోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఆడియో ట్రాక్, డైలాగులు వాడుకొని కాపీరైట్ ఉల్లంఘించిందని మద్రాస్ HCకు చెప్పింది. కాగా వాటిని తొలగించామని CSK చెప్పగా మరోసారి ఇరువర్గాల వాదన విని నిర్ణయం తీసుకుంటామని HC తెలిపింది.
News March 13, 2026
పెరిగిన విమాన టికెట్ల ధరలు!

ఆయిల్ ధరలు పెరగడంతో టికెట్లపై ఇంధన సర్‌ఛార్జ్‌లు విధించాలని ఎయిర్‌లైన్స్ భావిస్తున్నాయి. ఇప్పటికే ఎయిరిండియా వసూలు చేస్తుండగా, తాజాగా ఇండిగో కూడా పెంచింది. రేపటి నుంచి సర్వీసులను బట్టి ₹425-2,300 అదనంగా ఛార్జ్ చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ కూడా అదే దారిలో వెళ్తాయని తెలుస్తోంది. ఈమేరకు అంతర్గత చర్చలు జరుపుతున్నాయని, త్వరలో ధరలు ఖరారు చేస్తాయని సమాచారం.


