News November 19, 2025

పెద్దపల్లి: పత్తి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రికి ఎంపీ లేఖ

image

తెలంగాణ పత్తి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు లేఖ రాసినట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం తెలిపారు. రాష్ట్ర సగటు పత్తి దిగుబడిని 11.74 క్వింటాళ్లుగా కొనసాగించాలని, అలాగే పత్తిలో మాయిశ్చర్‌ పరిమితిని 20 శాతం వరకు సడలించాలని లేఖలో విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. మిల్లర్లు అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కూడా ఎంపీ కోరినట్లు తెలిపారు.

Similar News

News March 28, 2026

IPL 2026: కోహ్లీ ముందున్న 5 అరుదైన రికార్డులు

image

IPLలో కోహ్లీ పలు రికార్డులపై కన్నేశారు. 339 రన్స్ సాధిస్తే 9,000 IPL పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా నిలుస్తారు. అలాగే ఒకే జట్టు (RCB) తరపున 10,000 T20 రన్స్, 300 సిక్సర్లు బాదిన ఫస్ట్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. భారత్‌లో 10,000 T20 రన్స్ మైల్‌స్టోన్‌కు కేవలం 296 పరుగుల దూరంలో ఉన్నారు. ఒకే వేదికపై (చిన్నస్వామి స్టేడియం) హయ్యెస్ట్ రన్స్ రికార్డును మరింత మెరుగుపరుచుకోనున్నారు.

News March 28, 2026

జగిత్యాల: ఆశావర్కర్ల ముందస్తు అరెస్టు

image

తమ సమస్యల పరిష్కారం కోసం శనివారం చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌కు బయలుదేరుతున్న ఆశావర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

News March 28, 2026

KNR: మిగిలింది మూడు రోజులే.. ‘దళపతి’ ఎక్కడ.?

image

కేంద్ర మంత్రి అమిత్ షా పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో జగిత్యాల(D) బీర్పూర్‌కు చెందిన ముప్పాల లక్ష్మణరావు @గణపతి లొంగుబాటుపై సస్పెన్స్ విడడం లేదు. నేపాల్ లో గణపతిని అదుపులోకి తీసుకున్నారని, HYDలో CM రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోతారనే వార్తలు సైతం వెలుగులోకి వచ్చాయి. కానీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కగార్ డెడ్లైన్ ఇంకా 3రోజులే మిగిలి ఉంది.