News November 19, 2025

అల్ ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ అరెస్ట్

image

హరియాణా ఫరిదాబాద్‌లోని అల్ ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ జావెద్ అహ్మద్ సిద్ధిఖీని మనీలాండరింగ్ కేసులో ED అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ పేలుడు, టెర్రర్ మాడ్యూల్ కేసు దర్యాప్తులో భాగంగా నిన్న వర్సిటీ సహా 25 ప్రాంతాల్లో ED సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించింది. ఈక్రమంలోనే ఆయనను అదుపులోకి తీసుకుంది. కాగా వర్సిటీలో పనిచేసిన ముగ్గురు డాక్టర్లకు ఉగ్ర కుట్రతో సంబంధాలున్నాయన్న కోణంలో విచారణ జరుగుతోంది.

Similar News

News March 24, 2026

IPL: అత్యల్ప స్కోరు ఆర్సీబీదే!

image

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరు(287) రికార్డు సన్ రైజర్స్ హైదరాబాద్ పేరిట <<19457522>>ఉంటే<<>>.. అత్యల్ప స్కోర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నమోదు చేసింది. 2017లో కోల్‌కతా(KKR)పై బెంగళూరు (RCB) చేసిన 49 రన్స్ నేటికీ లీగ్ చరిత్రలో అత్యల్పం. ఆ తర్వాత వరుసగా రాజస్థాన్ రాయల్స్ (58, 59), ఢిల్లీ (66, 67) పరుగులతో ఉన్నాయి. 2008లో ముంబై బౌలర్ల ధాటికి KKR కూడా 67 పరుగులకే కుప్పకూలింది.

News March 24, 2026

పశ్చిమాసియా సంక్షోభం.. కేంద్ర మంత్రుల కీలక భేటీ

image

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో పార్లమెంటు హౌస్‌లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కీలక భేటీ జరుగుతోంది. ఈ మీటింగ్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఎరువుల మంత్రి నడ్డా హాజరయ్యారు. మరోవైపు ఇదే అంశంపై రేపు ఆల్ పార్టీ మీటింగ్‌కు కేంద్రం <<19464829>>పిలుపునిచ్చిన<<>> విషయం తెలిసిందే.

News March 24, 2026

రాజస్థాన్ రాయల్స్ విక్రయం!

image

IPL ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్‌ను అమెరికా వ్యాపారవేత్త కల్ సొమానీ కొనుగోలు చేశారు. మెజారిటీ వాటాదారు ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ నుంచి రూ.15,300 కోట్ల($1.63B)కు ఆయన ఆధ్వర్యంలోని కన్సార్షియం సొంతం చేసుకున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. ఈ IPL సీజన్ నుంచే ఇది అమల్లోకి రావచ్చని చెప్పింది. టోర్నీ చరిత్రలో ఇదే బిగ్గెస్ట్ డీల్ అని తెలుస్తోంది. మనోజ్ బదాలే(ఎమర్జింగ్ మీడియా వెంచర్స్)కు RRలో 65% వాటా ఉంది.