News April 12, 2024

NLG: అప్రకటిత కోతలతో ఇక్కట్లు..

image

నల్గొండ జిల్లా కేంద్రంలో అప్రకటిత విద్యుత్ కోతలతో అన్ని రంగాల వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు గంటల తరబడి కరెంట్ తీసేస్తుండటంతో ఇళ్ల నుంచి పని (వర్క్ ఫ్రం హోం) చేస్తున్న పలువురు ఉద్యోగులు అవస్థలు పడ్డారు. ఆయా షిప్టు సమయాల్లో విద్యుత్ ఉండకపోవడంతో అదనపు సమయం పనిచేయాల్సి వస్తోందని చెబుతున్నారు. అలాగే అప్పగించిన పనిని సమయానికి పూర్తి చేయలేకపోతుండటంతో ఒత్తిడి పెరుగుతోందన్నారు.

Similar News

News July 11, 2025

NLG: సంబురంగా మహిళాశక్తి సంబరాలు

image

జిల్లాలో మహిళా శక్తి సంబరాలు సంబురంగా జరుగుతున్నాయి. ఇప్పటికే గ్రామ మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించారు. 12 నుంచి 18 వరకు నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్లు, సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, పెట్రోల్ పంపుల నిర్వహణ, చేపలు, పెరటి కోళ్ల పెంపకం, కిరాణా దుకాణాలు, టెంట్ హౌస్, పాల డెయిరీ ఏర్పాట్లను ప్రోత్సహిస్తూ మహిళల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు.

News July 11, 2025

NLG: పంతుళ్ల పరేషాన్.. బడికి డుమ్మా ఇక కుదరిదిక!

image

సర్కారు బడులను గాడిలో పెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ సరికొత్త అస్త్రాన్ని సంధిస్తోంది. ఇప్పటివరకు విద్యార్థులకు FRS విధానం ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ప్రస్తుతం టీచర్లకు ఆ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు సన్నద్ధమవుతుంది. పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న పెద్దపల్లి జిల్లాలో FRS విధానం సత్ఫలితాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఉమ్మడి జిల్లాలో సైతం టీచర్ల ముఖ గుర్తింపు అటెండెన్స్ సిస్టం ప్రారంభం కాబోతుంది.

News July 11, 2025

NLG: న్యాయవాద వృత్తిలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలో లా కోర్సు చేసిన బీసీ విద్యార్థుల నుంచి న్యాయవాది వృత్తిలో మూడేళ్ల పాటు ఉచిత శిక్షణ పొందేందుకు 2025-26కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తెలిపారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన కళాశాల నుంచి లా కోర్స్ పాసై ఉండాలన్నారు. జిల్లాలో నలుగురు అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.