News November 19, 2025
కరీంనగర్: శీతాకాలంలో డ్రైవింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి: సీపీ

శీతాకాలంలో డ్రైవింగ్ చేసేటప్పుడు వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సూచించారు. రాత్రిపూట, తెల్లవారుజామున ఏర్పడే దట్టమైన పొగ మంచు కారణంగా దృశ్యమానత తగ్గి రోడ్డు ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారు. వాహనదారులు భద్రతను దృష్టిలో ఉంచుకొని.. నెమ్మదిగా డ్రైవింగ్ చేయాలని, పొగ మంచు ఉన్న సమయంలో ఓవర్టేక్ చేయవద్దని ఆయన సూచించారు.
Similar News
News March 13, 2026
కరీంనగర్ పీటీసీలో పాసింగ్ అవుట్ పరేడ్

కరీంనగర్‌లోని స్థానిక పోలీస్ శిక్షణ కేంద్రం (PTC)లో 2025–2026 బ్యాచ్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ వైభవంగా జరిగింది. ఈ శిక్షణలో అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి TGSP కానిస్టేబుల్ గోగికర్ రోహన్ ‘ఆల్ రౌండర్’ అవార్డును కైవసం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ముఖ్యఅతిథిగా హాజరై రోహన్‌కు ట్రోఫీని అందజేసి, ప్రత్యేకంగా అభినందించారు.
News March 12, 2026
KNR: ఆర్ఎంపీ కళ్లలో కారం కొట్టి గొలుసు అపహరణ

తిమ్మాపూర్ మండలం నేదునూరులో ఆర్ఎంపీ తమ్మనవేణి కొమరయ్యపై దుండగుడు దాడికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి విధి నిర్వహణ ముగించుకొని వస్తుండగా, జెన్కో సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి లిఫ్ట్ అడిగి.. అకస్మాత్తుగా కొమరయ్య కళ్లలో కారంపొడి చల్లాడు. ఈ క్రమంలో కొమరయ్య వద్ద నుంచి 12 గ్రాముల బంగారు గొలుసు, నగదు ఎత్తుకెళ్లి మామిడి తోటలోకి పారిపోయాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
News March 12, 2026
కరీంనగర్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు

కరీంనగర్(D)లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి స్పష్టం చేశారు. వినియోగదారులు ఆందోళన చెందకుండా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవాలన్నారు. సింగిల్ సిలిండర్‌కు 25 రోజులు, డబుల్‌కు 15 రోజుల గడువు ఉంటుందని తెలిపారు. గ్యాస్ పొందే సమయంలో ఓటీపీ తప్పనిసరిగా చెప్పాలన్నారు. కృత్రిమ కొరత సృష్టించినా, డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


