News November 19, 2025

మేడ్చల్: వరి సాగు చేశారా..? ఈ నంబర్లు ఫీడ్ చేసుకోండి

image

మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో వరి సాగు చేసిన రైతులకు అధికారులు సూచన చేశారు. 1967,1800 425 00333 నంబర్లను మీ వద్ద ఉంచుకోవాలని సూచించారు. కొనుగోలు సమయంలో ఏదైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయవచ్చని, HYDలో సివిల్ సప్లై భవన్ నుంచి సమస్యలు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోళ్ల పై సైతం ఫిర్యాదు చేయవచ్చన్నారు.

Similar News

News March 22, 2026

SRH 250 స్కోర్ చేసినా లాభం లేదు: ఆకాశ్ చోప్రా

image

IPL-2026లో SRH జట్టు 250 రన్స్ చేసినా లాభం లేదని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. ఆ జట్టులో బ్యాటర్లు 250 పరుగులు చేస్తే బౌలర్లు కూడా 250 పరుగులు సమర్పించుకుంటారని పేర్కొన్నారు. అంత బలహీనంగా ఆ జట్టు బౌలింగ్ ఉందని అన్నారు. ‘కమిన్స్, ఎషాన్ మలింగా అందుబాటులో లేకపోవడంతో బ్రైడన్ కార్స్‌ను ఆడించాల్సి వస్తుంది. ఇండియన్ బౌలర్లతో మేనేజ్ చేయడమూ సవాలే’ అని పేర్కొన్నారు.

News March 22, 2026

VZM: జాతీయ స్థాయి పోటీల్లో క్రీడాకారుల సత్తా

image

24వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాకి చెందిన క్రీడాకారులు పతకాలు సాధించినట్లు క్రీడా అధికారి ఎస్.వెంకటేశ్వరరావు ఆదివారం తెలిపారు. మార్చి 18-21 వరకు భువనేశ్వర్‌లో జరిగిన పోటీల్లో గుమ్మలక్ష్మీపురానికి చెందిన కె.లలిత 400 మీ, 1500 మీ.ల పరుగు పోటీల్లో గోల్డ్, బ్రాంజ్ మెడల్ సాధించగా.. బొబ్బిలికి చెందిన కె.గౌతమ్ లాంగ్ జంప్‌లో బ్రాంజ్ మెడల్ సాధించినట్లు చెప్పారు.

News March 22, 2026

సైదాపురం మైకా గనులపై MP కన్ను: YCP

image

సైదాపురంలోని మైకా గనులను ఇష్టానుసారం తవ్వుకునేందుకు కూటమి పెద్దలు పథకం సిద్ధం చేశారని YCP ఆరోపించింది. ‘ఇప్పటికే లీజు ముగిసిపోయిన గనుల్లో ఇంకా తవ్వకాలు జరుపుతూ రూ.వందల కోట్ల పెనాల్టీకి గురైన సంస్థలను ప్రభుత్వం వెనకేసుకు వస్తోంది. ఆ పెనాల్టీ చెల్లించనక్కర లేకుండానే వారికి లీజును కొనసాగించడానికి ఫైల్ సిద్ధం చేస్తోంది. దీని వెనక TDP ముఖ్య నేతతో పాటు MP ఉన్నట్లుగా తెలిసింది’ అంటూ ‘X’లో రాసుకొచ్చింది.