News November 19, 2025

కర్నూలు ఘోర ప్రమాదం.. మృతులు వీరే..!

image

కర్నూలు జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. జాతీయ రహదారిపై కేశవ గ్రాండ్ హోటల్ వద్ద రోడ్డు దాటుతున్న పాదచారులను హైదరాబాద్ వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కల్లూరు మండలం గోకులపాడుకు చెందిన లక్ష్మీనారాయణ(56), శ్రీనివాసులు(65), రామిరెడ్డి(40)గా పోలీసులు గుర్తించారు. మెకానిక్ షేక్ జిలాని బాషా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Similar News

News March 20, 2026

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు.. రిజిస్ట్రేషన్లు షురూ

image

2026-27 విద్యాసంవత్సరానికి గాను కేంద్రీయ విద్యాలయాల్లో(KV) అడ్మిషన్లకు నేటి నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైంది. ఒకటో తరగతితోపాటు బాల్ వాటికల్లో ప్రవేశాలకు <>https://kvsangathan.nic.in<<>>/లోకి వెళ్లి ఏప్రిల్ 2 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బాల్ వాటికలకు ఏప్రిల్ 8న, ఒకటో తరగతికి 9న తొలి జాబితాను విడుదల చేస్తారు. సీట్ల ఖాళీలను బట్టి 16న రెండో, 21న మూడో లిస్టును ప్రకటిస్తారు.
Share It

News March 20, 2026

అనకాపల్లి: ఈనెల 24న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు

image

జిల్లాస్థాయి శాప్ లీగ్స్ అథ్లెటిక్స్(మాస్టర్స్) పోటీలు ఈనెల 24న అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి పి.శైలజ శుక్రవారం తెలిపారు. 35, 45 ఏళ్ల పైబడిన విభాగాల్లో పురుషులు, మహిళలకు వేరువేరుగా పోటీలు జరుగుతాయన్నారు. వీటిలో ఎంపికైన వారు ఈనెల 30, 31 తేదీల్లో గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్తారన్నారు.

News March 20, 2026

తిరుపతి జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారిగా హరీశ్

image

తిరుపతి జిల్లా ఎస్సీ వెల్ఫేర్&ఎంపవర్‌మెంట్ ఆఫీసర్ (DSCW & EO)గా వి.వి. హరీశ్ కొల్ల బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎస్సీ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిసింది. జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని హరీశ్ తెలిపారు.