News November 19, 2025

మేడ్చల్: ‘కాలుష్యానికి కారణ భూతంగా.. ఈ పరిశ్రమలు..!

image

మల్లాపూర్, నాచారం, చర్లపల్లి, కీసర, ప్రశాంత్ నగర్, బొల్లారం, జీడిమెట్ల సహా పలు ప్రాంతాల్లో 60కి పైగా అనుమతులు లేని పరిశ్రమలు నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పరిశ్రమలు తమ రోజువారీ ఉత్పత్తుల సామర్థ్యం మేరకు వ్యర్థ ద్రవాల శుద్ధి సదుపాయాలు లేకుండానే యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు తేలింది. ఇవే కాలుష్యానికి ప్రధాన కారణభూతంగా మారుతున్నాయని, వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.

Similar News

News March 22, 2026

వికారాబాద్ జిల్లాలో ఫైర్ యాక్సిడెంట్స్ REPORT

image

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 2026 సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటివరకు మొత్తం 61 అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనల్లో ఆస్తి నష్టం గణనీయంగా నమోదైనట్లు తెలిపారు. ప్రజలు ఫైర్ యాక్సిడెంట్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫైర్ సేఫ్టీ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.

News March 22, 2026

సిద్దిపేట: ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

image

సిద్దిపేట రమాదేవి ఆసుపత్రిలో ఓ మహిళ ముగ్గురు మగ శిశువులకు జన్మనిచ్చింది. ఖాదర్‌పురాకు చెందిన ఖాలిద్ బిన్ సవుద్ దంపతులకు ముగ్గురు పిల్లలు పుట్టారు. శిశువులు వరుసగా 3 కేజీలు, 2.5 కేజీలు, 2 కేజీల బరువుతో జన్మించారని, ప్రస్తుతం తల్లితో పాటు ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబీకులు తెలిపారు.

News March 22, 2026

ఆదిలాబాద్‌: గడప దాటితే నీటి యుద్ధమే

image

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో తాగునీటి సమస్య కేవలం ఒక వార్తాంశం కాదు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో అక్కడి ప్రజల ప్రతిరోజూ సాగే కన్నీటి పోరాటం. ఎండ వేడిమి పెరిగే కొద్దీ, చిన్నారుల నుంచి వృద్ధుల వరకు నీటి చుక్క కోసం పడే ఆరాటం వర్ణనాతీతం. మారుమూల గ్రామాల్లో గడప దాటగానే మొదలయ్యే నీటి వేట, వారి కష్టాలను ప్రతిబింబిస్తోంది. దీంతో ఎండాకాలంలో నీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే మేలు.