News November 19, 2025
డేటా క్లియర్ చేసి.. ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ దాచిన రవి!

TG: అరెస్ట్ సమయంలో గంటన్నరపాటు ఐ-బొమ్మ రవి ఇంటి తలుపులు తెరవలేదని పోలీసులు తెలిపారు. తాము వచ్చింది చూసి టెలిగ్రామ్, మొబైల్ డేటాను క్లియర్ చేశాడని చెప్పారు. ల్యాప్‌టాప్‌ను బాత్‌రూమ్ రూఫ్ కింద, సెల్‌ఫోన్‌ను అల్మారాలో దాచినట్లు వివరించారు. అటు పోలీసుల విచారణలో రవి నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు. స్నేహితులు, బంధువులతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని పేర్కొన్నాడు.
Similar News
News March 5, 2026
ఏం కొట్టావయ్యా అలెన్..

T20WC సెమీస్‌లో SAపై న్యూజిలాండ్ ఓపెనర్ <<19299856>>ఫిన్ అలెన్<<>> విధ్వంసం సృష్టించారు. 33 బంతుల్లోనే శతకం బాదారు. ఇందులో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. T20WCలో, ఫుల్ మెంబర్ టీమ్‌పై ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. 2016లో ఇంగ్లండ్‌పై గేల్(WI) 47 బంతుల్లో మూడంకెల స్కోర్ బాదారు. ఓవరాల్‌గా T20Iలలో మూడో వేగవంతమైన శతకం. 2024లో సాహిల్(ఎస్టోనియా)vsసైప్రస్‌పై 27 బంతుల్లో, ఫహాద్(తుర్కియే)vsబల్గేరియాపై 29 బాల్స్‌లో సెంచరీ చేశారు.
News March 5, 2026
GALLERY: ‘విరోష్’ రిసెప్షన్.. తళుక్కుమన్న తారలు

విజయ్ దేవరకొండ-రష్మిక రిసెప్షన్‌లో సినీ తారలు సందడి చేశారు. నానీ, వెంకటేశ్, నాగార్జున, నాగచైతన్య, అల్లుఅర్జున్, కార్తీ, నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, సత్యదేవ్ తదితరులు నూతన వధూవరులకు గ్రీటింగ్స్ చెప్పారు. ఇక రాజకీయ ప్రముఖుల్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విరోష్ జంటకు శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వదించారు.
News March 5, 2026
అధికారులు బడి భోజనం చేయాల్సిందే..

TG: స్కూళ్లు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలను సర్కారు సీరియస్‌గా తీసుకుంది. అలాంటివి జరగకుండా కలెక్టర్ నుంచి స్పెషలాఫీసర్లు, ఇతర అధికారులు హాస్టళ్లు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనం చేయాలని CM ఆదేశించారు. రానున్న ‘99 రోజుల ప్రజాపాలన’ నుంచే దీనిని ఆరంభించాలన్నారు. విద్యా సంవత్సరం మొత్తం అమల్లో ఉండాలని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లలో విద్యార్థులతో కలిసి భుజించాలన్నారు.


