News November 19, 2025

తలసానిని కలిసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన నవీన్ యాదవ్.. మామ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తలసానికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను తలసాని ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.

Similar News

News March 20, 2026

ఖమ్మం: బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన బాలుడు!

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలికను 14 ఏళ్ల బాలుడు ఆడుకుందామని మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మైనర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

News March 20, 2026

మడకశిర: అర్ధరాత్రి యాక్సిడెంట్.. యువకుడి మృతి

image

మడకశిర మండలం అయ్యవారిపల్లి సమీపంలోని ప్రధాన రహదారిపై గురువారం రాత్రి ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీకొన్నాయి. స్థానికుల వివరాల మేరకు.. చీపులేటి గ్రామనికి చెందిన తిప్పేస్వామి, చంద్రమౌళి బైక్‌పై వెళుతుండగా మార్గంమధ్యంలో ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిప్పేస్వామి మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 20, 2026

చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు..!

image

అల్పపీడన ద్రోణి ప్రభావ కారణంగా గడచిన 24 గంటల్లో వి.కోట, గుడుపల్లె మినహా మిగిలిన 26 మండలాల్లో వర్షం కురిసింది. గంగవరంలో 39.4 mm, పలమనేరులో 37.8 mm వర్షపాతం నమోదైంది. మండలాలు వారీగా.. యాదమరిలో 28.0, పూతలపట్టు, రొంపిచెర్ల మండలాల్లో 24.2, పెనుమూరులో 23.2, వెదురుకుప్పంలో 22.2, బైరెడ్డిపల్లిలో 17.2, గుడిపాలలో 12.4, పాలసముద్రం, విజయపురం మండలాల్లో 12.2, చిత్తూరు రూరల్ లో 10.6 mm వర్షపాతం నమోదు అయింది.