News November 19, 2025

తలసానిని కలిసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన నవీన్ యాదవ్.. మామ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తలసానికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను తలసాని ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.

Similar News

News March 14, 2026

SKU నూతన వైస్ ఛాన్స్‌లర్‌గా జ్యోతి కుమార్

image

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నూతన వైస్ ఛాన్స్‌లర్‌గా NVR జ్యోతి కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన మిజోరాం యూనివర్సిటీలో కామర్స్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఇప్పటి నుంచి 3 ఏళ్ల పాటు ఈయన వైస్ ఛాన్స్‌లర్‌గా కొనసాగనున్నారు.

News March 14, 2026

కొత్తపల్లి – జూరాల వంతెన నమూనా ఇదే..!

image

కృష్ణా నదిపై గద్వాల, వనపర్తి జిల్లాల అనుసంధానమే లక్ష్యంగా కొత్తపల్లి-జూరాల హైలెవల్ వంతెన నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. ఈ వంతెన రూ.120 పైగా కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. 10 మీటర్ల వెడల్పు, ఫుట్‌పాత్‌తో కూడిన ఈ వంతెన, అప్రోచ్ రోడ్లతో కలిపి మొత్తం 10.5 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. ఈ వారధి అందుబాటులోకి వస్తే మూడు జిల్లాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు పర్యాటక రంగం కూడా మరింతగా పుంజుకోనుంది.

News March 14, 2026

10th విద్యార్థులకు అలర్ట్: కడప DEO

image

కడప జిల్లాలో సోమవారం నుంచి 10th పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. విద్యార్థులు మానసిక ప్రశాంతతో, ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని DEO శంషుద్దీన్ సూచించారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సరఫరా, తాగునీరు, ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉంచామన్నారు. 144 సెక్షన్, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.