News November 19, 2025

పెద్దపల్లి: అభయ హస్తం పథకానికి ఈనెల 21 వరకు గడువు.!

image

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద రూ.లక్ష రూపాయల ప్రోత్సాహం కోసం అర్హులైన అభ్యర్థులు ఈ నెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి సీఎండీ బలరాం మంగళవారం ప్రకటించారు. అభ్యర్థుల విజ్ఞాపనల మేరకు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అభ్యర్థులు హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో దరఖాస్తులను సమర్పించాలని ఆయన సూచించారు.

Similar News

News March 8, 2026

NLG: ఆర్టీసీ ప్రగతి చక్రంలోనూ నారీశక్తి..!

image

TG-RTC అభ్యున్నతిలో మహిళా ఉద్యోగులు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో మహిళా సిబ్బంది తమ పనితీరుతో సంస్థకు ఆదాయ వనరులుగా మారారు. 7 డిపోలలో కలిపి మొత్తం 328 మంది మహిళలు విధుల్లో ఉన్నారు. వీరిలో 308 మంది కేవలం కండక్టర్లుగానే సేవలందిస్తూ బస్సులను లాభాల బాటలో నడిపిస్తున్నారు. అత్యధికంగా నల్గొండ డిపోలోనే 80 మంది మహిళా కండక్టర్లు పనిచేస్తుండటం విశేషం.

News March 8, 2026

CA ఫలితాలు విడుదల

image

ఛార్టర్డ్ అకౌంటెన్సీ(CA) ఫలితాలను ICAI రిలీజ్ చేసింది. ఫౌండేషన్, ఇంటర్ పరీక్షల రిజల్ట్స్‌ను <>వెబ్‌సైట్‌<<>>లో ఉంచినట్లు తెలిపింది. అలాగే ఆలిండియా మెరిట్ లిస్టును అందుబాటులో ఉంచింది. జనవరి 18, 20, 22, 24 తేదీల్లో పరీక్షలు జరిగాయి. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్, రోల్ నంబర్లు ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ICAI ఏటా 3 సార్లు(జనవరి, మే/జూన్, సెప్టెంబర్) ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తుంది.

News March 8, 2026

బోరవెల్లి ‘కవిపోషక రాణి’ గిరియమ్మ

image

రాజకుమారి గిరియమ్మ బోరవెల్లి కోట సంస్థాన చినసోమభూపాలుడి భార్య. సంతానం లేకపోవడంతో పెద్దసోమభూపాలుని కుమారుడు వెంకటపతిని దత్తత తీసుకున్నారు. గద్వాల కవులు-పండితులను పోషించి కవిపోషక రాణిగా పేరు తెచ్చుకున్నారు. దత్తపుత్రుడు వెంకటపతి కూడా తల్లికి తగ్గట్టుగా సాహిత్యాన్ని ఆదరించారు. 1668లో వెంకటపతి సంస్థానాన్ని గద్వాలలో విలీనం చేసి తన పుట్టినిల్లు గద్వాల సంప్రదాయాన్ని బోరవెల్లిలో తెచ్చి కీర్తిని తెచ్చారు.