News November 19, 2025

INDIA హసీనాను బంగ్లాకు అప్పగించకపోవచ్చు!

image

నిరసనల అణచివేతకు ఆదేశాలిచ్చి పలువురి మృతికి కారణమయ్యారనే ఆరోపణలతో దేశాన్ని వీడిన PM హసీనాకు బంగ్లా కోర్టు ఉరిశిక్ష విధించడం తెలిసిందే. నేరారోపణలున్న ఆమెకు ఆశ్రయం తగదని ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం వెంటనే అప్పగించాలని ఆ దేశం ఇండియాను హెచ్చరించింది. అయితే అందుకు అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఆర్టికల్ 8, 29 ప్రకారం రాజకీయ ప్రేరేపిత, న్యాయ విరుద్ధ అభ్యర్థనను తోసిపుచ్చే అధికారం ఇండియాకు ఉంది.

Similar News

News March 28, 2026

ఆ జిల్లాలకు APSDMA బిగ్ అలర్ట్

image

AP: రాష్ట్రంలోని 35 మండలాల్లో రేపు తీవ్ర వడగాల్పులు, 87 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. SKLM, VZM, మన్యం, అల్లూరి, పోలవరం, NTR జిల్లాల్లోని పలు మండలాల్లో తీవ్ర ప్రభావం ఉండే ఆస్కారముందని చెప్పింది. రాయలసీమ, సెంట్రల్ ఆంధ్రాలో 40°C-42°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఇక ఇవాళ మార్కాపురం(D) బొట్లగూడురులో 42.6°C ఉష్ణోగ్రత రికార్డ్ అయినట్లు పేర్కొంది.

యుద్ధం వేళ భారత్ వ్యూహం.. హార్ముజ్ దాటిన నౌకలు

image

దేశంలో ఇంధన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వార్‌ విషయంలో తటస్థంగా ఉంటూ ఇరాన్‌ నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటోంది. దీంతో ఆ దేశం హార్ముజ్ నుంచి మన నౌకలను పంపుతోంది. తాజాగా మరో 2LPG షిప్‌లూ జలసంధి దాటాయి. ఇక గల్ఫ్ దేశాలతోనూ స్నేహం కొనసాగిస్తోంది. ఇవాళ సౌదీ రాజుతో PM మోదీ ఫోన్‌లో మాట్లాడారు. సురక్షిత నౌకాయానానికి సహకరించాలని కోరారు.