News November 19, 2025

నీటి వాడుక లెక్కలు తేల్చేందుకు AP సహకరించడం లేదు: ఉత్తమ్

image

కృష్ణా జలాల వినియోగాన్ని తెలుసుకొనేలా టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు AP సహకరించడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ‘నీటిని ఏ రాష్ట్రం ఎంత వినియోగిస్తోందో తెలుసుకొనేందుకు 18 టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటుచేశాం. మరో 20 ఏర్పాటుకావాలి. వీటి ఏర్పాటుకు ఏపీ ముందుకు రావడం లేదు. తన వాటా నిధులూ ఇవ్వడం లేదు. స్టేషన్ల ఏర్పాటుకు ఆ నిధులనూ మేమే ఇస్తామని కేంద్రానికి చెప్పా’ అని ఉత్తమ్ పేర్కొన్నారు.

Similar News

News March 5, 2026

265 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>మధ్యప్రదేశ్ <<>>ఇటార్సిలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ 265 కెమికల్ ప్రాసెస్ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ (NAC) ఉన్నవారు మార్చి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.19,900+DA చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ddpdoo.gov.in

News March 5, 2026

టాస్ ఓడిన భారత్.. జట్టు ఇదే

image

T20WC: INDతో జరగనున్న సెమీఫైనల్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాసేపట్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది.
భారత్: శాంసన్, అభిషేక్, కిషన్, తిలక్, సూర్య (C), హార్దిక్, దూబే, అక్షర్, వరుణ్, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
ఇంగ్లండ్: సాల్ట్, బట్లర్, బ్రూక్ (C), బెథెల్, బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, ఓవర్టన్, డాసన్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్.

News March 5, 2026

‘అస్థిర’ నేపాల్: 17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు..

image

నేపాల్‌లో 2008లో రాచరిక పాలన అంతమయ్యాక ప్రచండ(నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ-మావోయిస్ట్) అధికారాన్ని చేపట్టారు. అయితే ఏడాదికే ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-మార్కిస్ట్, నేపాలీ కాంగ్రెస్ నేతలు PM పీఠం చేపట్టారు. అవినీతి, పార్టీలకు మెజార్టీ లేకపోవడంతో 17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు మారాయి. కేపీ ఓలీ సర్కార్ కూలిన తర్వాత ఇవాళ ఎన్నికలు జరిగాయి. విజేత ఎవరో రేపు <<19301003>>తేలనుంది.<<>>