News April 13, 2024
టుడే టాప్ న్యూస్
➤AP: చంద్రబాబు మోసాలకు, ప్రజలకు యుద్ధం: CM జగన్
➤హంతకుల్ని జగన్ రక్షిస్తున్నారు: షర్మిల
➤జగన్ ఐదేళ్లలో ఎవరినైనా కలిశారా: CBN
➤AP: ఇంటర్ ఫలితాలు విడుదల
➤TG: సీబీఐ కస్టడీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
➤ధాన్యం కొనుగోళ్లలో తరుగు తీస్తే కఠిన చర్యలు: సీఎం రేవంత్
➤పొరపాట్లు చేశాం.. సరిదిద్దుకుంటాం: కేటీఆర్
➤వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మారేపల్లి సుధీర్ కుమార్
➤ IPL: LSGపై DC విజయం
Similar News
News January 15, 2025
కేంద్ర మంత్రులతో శ్రీధర్‌బాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ
TG: కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, గజేంద్ర సింగ్‌తో రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు ఢిల్లీలో సమావేశమయ్యారు. సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణకు సహకరించాలని వైష్ణవ్‌ను కోరారు. ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానించారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, రామగిరి ఫోర్ట్‌ల అభివృద్ధికి సహకరించాలని గజేంద్ర సింగ్‌కు విజ్ఞప్తి చేశారు.
News January 15, 2025
ఈ OTTలోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ స్ట్రీమింగ్!
విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను తెగ మెప్పిస్తోంది. నవ్వులు పూయించే ఈ సినిమాను చూసేందుకు వృద్ధులు సైతం థియేటర్‌కు వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఈ చిత్ర ఓటీటీ హక్కులను ‘ZEE5’దక్కించుకుంది. 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఇంతకీ మీరు ఈ సినిమా చూశారా?
News January 15, 2025
మనోజ్‌పై చర్యలు తీసుకోండి.. మోహన్ బాబు ఫిర్యాదు
AP: కుమారుడు మంచు మనోజ్‌పై మోహన్‌బాబు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 200 మందితో మోహన్ బాబు వర్సిటీలోకి <<15163428>>ప్రవేశించేందుకు<<>> మనోజ్ ప్రయత్నించారని తెలిపారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు అక్కడికి వెళ్లొద్దని పోలీసులు చెప్పినా వినలేదన్నారు. డైరీఫాం గేటు దూకి లోపలకి ప్రవేశించారని పేర్కొన్నారు.