News November 19, 2025

పల్నాడు జిల్లాను పచ్చదనంతో నింపాలి: కలెక్టర్

image

జిల్లాను పచ్చదనంతో నింపి హరిత పల్నాడును ఆవిష్కృతం చేయాలని కలెక్టర్ కృతిక శుక్లా అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం వనం – మనం జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో అన్ని శాఖలు సమష్టిగా, సమన్వయంతో పనిచేయాలని అన్నారు. విద్యా సంస్థలు, ఇతర కార్యాలయాలు, ఖాళీ స్థలాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి శాఖకు నిర్దేశించిన లక్ష్యాలు, లక్ష్యాలుపై నివేదిక సమర్పించాలన్నారు.

Similar News

News March 11, 2026

అయినవిల్లి: ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి

image

అయినవిల్లి మండలంలో దారుణం జరిగింది. రెండో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికపై 60 ఏళ్ల యడ్ల సూరిబాబు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు రెండుసార్లు ఆఘాయిత్యం చేసినట్లు SI జ్యోతి బుధవారం తెలిపారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పసిపాపపై వృద్ధుడి వికృత చేష్టలతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News March 11, 2026

అభివృద్ధి పథకాలకు జనగణనే దిక్సూచి: కలెక్టర్

image

నల్గొండ: జనాభా అన్నింటికీ ప్రామాణికం అని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో 2027 జనగణనపై ఏర్పాటు చేసిన 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక దేశానికి జనగణన అతి ముఖ్యమని, ముఖ్యంగా దేశ అభివృద్ధి జనాభాపైనే ఆధారపడి ఉంటుందని, ప్రజలకు అవసరమైన పథకాల రూపకల్పనలో, అలాగే ఇతర అంశాలలో జనాభా కీలక పాత్ర వహిస్తుందన్నారు.

News March 11, 2026

13న GVMC చివరి సమావేశం.. బిల్లులన్నింటికీ ఆమోదం?

image

జీవీఎంసి స్థాయీ సంఘం సమావేశం ఈ నెల 13న మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరగనుంది. మొత్తం 193 అంశాలతో అజెండా సిద్ధం చేశారు. ఈ నెల 17తో పాలకవర్గం గడువు ముగియనున్న నేపథ్యంలో ఇదే చివరి సమావేశం. గతంలో నిబంధనలకు విరుద్ధంగా, పనుల్లో నాణ్యత లేదంటూ బిల్లుల చెల్లింపులు వాయిదా వేసిన లేదా తిరస్కరించిన అంశాలకు కూడా ఆమోదం లభించే అవకాశం కనిపిస్తోంది.