News April 13, 2024
ఖమ్మం మెడికల్ కాలేజీ నిర్మాణంపై తుమ్మల సమీక్ష

ఖమ్మం మెడికల్ కాలేజి నిర్మాణం కాంట్రాక్టర్, బిల్డింగ్ డిజైన్ కన్సల్టెన్సీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీఅయ్యారు. తరగతి గదులు, హాస్టల్ బిల్డింగ్స్, ప్రొఫెసర్స్ క్వార్టర్స్, స్టాఫ్ క్వార్టర్స్, క్రీడా మైదానం నిర్మాణం కేటాయించిన స్థల ప్రాంగణంలో ఏ బిల్డింగ్ ఎక్కడ నిర్మిస్తే బాగుంటుందనే విషయం త్వరలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
Similar News
News April 21, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు….

∆}మధిరలో జాబ్ మేళా∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన ∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన ∆} పైనంపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు
News April 21, 2025
నేలకొండపల్లి: యువకుడి సూసైడ్ UPDATE

నేలకొండపల్లి(M)శంకరగిరి తండాలో<<16160491>> యవకుడు సూసైడ్ <<>>చేసుకున్న విషయం తెలిసిందే. స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన ధరావత్ రాజు(24) 2 రోజుల కింద ఖరీదైన ఫోన్ కొన్నాడు. ఏ పని చేయకుండా అంత ఖరీదైన ఫోన్ ఎందుకు కొన్నావని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన రాజు పురుగుందు తాగాడు. ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
News April 21, 2025
ఖమ్మం: భానుడి ప్రతాపం.. ఆ మండలాల్లోనే టాప్.!

ఖమ్మం జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఆదివారం చింతకాని, ముదిగొండ (పమ్మి), (బాణాపురం)లో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అటు కారేపల్లి, కామేపల్లి(లింగాల), వైరాలో 42.7, ఎర్రుపాలెం 42.6, కూసుమంచి 42.1, మధిర 42.0, పెనుబల్లి, నేలకొండపల్లి 41.7, రఘునాథపాలెం 41.6, ఖమ్మం (U) 41.4, ఖమ్మం (R) పల్లెగూడెం, తిరుమలాయపాలెం (బచ్చోడు) 41.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.