News November 19, 2025

సిర్పూర్(టి): ఈ నెల21 షూటింగ్ బాల్ పోటీలు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి అస్మిత ఖేలో ఇండియా షూటింగ్ బాల్ బాలికల ఎంపిక పోటీలు ఈ నెల 21న సిర్పూర్ (టి)లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో నిర్వహించనున్నారు. క్రీడాకారులు ధ్రువపత్రాలతో ఉదయం 9 గంటలకు హాజరై, ప్రిన్సిపల్ లావణ్యకు రిపోర్ట్ చేయాలని జిల్లా షూటింగ్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి గురువేందర్ తెలిపారు.

Similar News

News March 25, 2026

తిరుపతి జిల్లాలో 246 మంది డుమ్మా

image

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 10వ తరగతి భౌతిక శాస్త్రం పరీక్ష జరిగింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 27,068 మంది విద్యార్థులకు గాను 26,822 మంది హాజరుకాగా 246 మంది గైర్హాజరైనట్లు DEO KVN కుమార్ తెలిపారు. ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి పరీక్షలకు సంబంధించి 839 మందికి గాను 732 మంది హాజరై 107 మంది గైర్హాజరు అయినట్లు పేర్కొన్నారు. ప్రశాంతంగా పరీక్షలు జరిగినట్లు ఆయన అన్నారు.

News March 25, 2026

ఏలూరు: భద్రాచలం రామయ్య దర్శనానికి ప్రత్యేక బస్సులు

image

శ్రీరామనవమి పురస్కరించుకుని ఏలూరు జిల్లా నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారిణి షేక్ షబ్నం బుధవారం తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఏలూరు డిపో నుంచి 20, జంగారెడ్డిగూడెం నుంచి 14, నూజివీడు నుంచి 6 బస్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈనెల 26 ఉదయం నుంచి బస్సులు ప్రారంభమై, 27న స్వామివారి కల్యాణం అనంతరం తిరిగి ప్రయాణమవుతాయని ఆమె వివరించారు.

News March 25, 2026

ఎస్సీ, ఎస్టీలకు పూర్తి స్థాయిలో లబ్ధి అందాలి: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రభుత్వం కేటాయించిన నిధులు, పథకాల లబ్ధి పూర్తి స్థాయిలో చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కేటాయించిన శాతాన్ని ఖచ్చితంగా ఖర్చు చేయాలని, హౌసింగ్, ఉపాధి, పెన్షన్లు వంటి పథకాలలో లక్ష్యాలు చేరాలని సూచించారు. గురుకులాలు, హాస్టళ్లలో జీరో వేస్ట్ మేనేజ్‌మెంట్ అమలు చేయాలని, PMAGY పనులు ఏప్రిల్‌లోపు పూర్తి చేయాలని పేర్కొన్నారు.