News November 19, 2025

ఆన్లైన్ మోసాలపై తస్మాత్ జాగ్రత్త: ప్రకాశం SP

image

ఆన్‌లైన్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP హర్షవర్ధన్ రాజు సూచించారు. మంగళవారం ఒంగోలు SP కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నాయని అన్నారు. ఫ్రాడ్ కాల్ స్కామ్‌ల ద్వారా సైబర్ మోసగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి మోసాలపై హెల్ప్ లైన్ నంబర్ 1930కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Similar News

News February 11, 2026

అనుమతుల జారీలో జాప్యం ఉండరాదు: జేసీ

image

ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో జరిగే భవన నిర్మాణాలకు అనుమతుల జారీలో జాప్యం ఉండరాదని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి స్పష్టం చేశారు. ఈ సంస్థకు వైస్ ఛైర్మన్‌గా ఉన్న ఆమె బుధవారం సిబ్బందితో ప్రకాశం భవనంలో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్, భవన నిర్మాణ అనుమతులపై జేసీ ఆరా తీశారు.

News February 11, 2026

జిల్లా ప్రజలకు ప్రకాశం ఎస్పీ కీలక సూచనలు

image

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని శివాలయాల వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రముఖ ఆలయాల వద్ద చర్యలు చేపట్టామన్నారు. ఏదైనా సాయం కోసం డయల్ 100 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.

News February 11, 2026

ప్రకాశం: టెన్త్ విద్యార్థులకు రేపే లాస్ట్ ఛాన్స్

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. భవిష్యత్తులో 10 మార్కుల లిస్ట్ అన్నింటికీ కీలకం. అందులో తప్పులు ఉంటే ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికే ఫీజు చెల్లించిన విద్యార్థులు వివరాల్లో తప్పులు ఉంటే రేపటి(FEB 12) లోగా సరిచేసుకోవాలి. HMలను సంప్రదించి విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, కులం, ఫొటో, సంతకం మార్చుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ మార్చడం వీలుండదని DEO రేణుక తెలిపారు.