News April 13, 2024

కాంగ్రెస్ మోసాలు.. మన ప్రచార హస్త్రాలు: హరీష్ రావు

image

కాంగ్రెస్ మోసాలనే ప్రచార హస్త్రాలుగా వాడుకొని ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాలని కార్యకర్తలకు మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ను ఎండగట్టారు. ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఎల్ఈడీ స్కిన్ పై పార్టీ శ్రేణులకు చూపించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై నిలదీయాలన్నారు.

Similar News

News March 12, 2026

తూప్రాన్: విషాదం.. కొడుకు కోసం వెళ్లి తల్లి మృతి

image

తూప్రాన్ పట్టణ పరిధిలోని కరీంగూడకు చెందిన గోగుల లక్ష్మి(45) కొడుకును వెతికేందుకు వెళ్లిన నీటిలో మునిగి చనిపోయింది. మూడు రోజులుగా పనులకు వెళ్లిన కోడుకు కనిపించకుండా పోవడంతో నిన్న రాత్రి కొడుకును వెతికేందుకు వెళ్లిన ఆమె అల్లాపూర్ శివారులోని నీటిలో పడి మృతి చెందింది. గురువారం మృతదేహాన్ని గుర్తించగా కొడుకు ఫిర్యాదుతో తూప్రాన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 12, 2026

మెదక్: ఇంటర్ పరీక్షలకు 96.71 % హాజరు

image

మెదక్ జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 6085 మందికి గాను 5895 మంది, ఒకేషనల్ విభాగంలో 279 మందికి గాను 260 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలో 96.71% హాజరు నమోదైంది. నేటితో మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు.

News March 11, 2026

మహిళలు ఆర్థిక అంశాలపై పట్టు సాధించాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

image

మెదక్ కలెక్టరేట్‌లో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రతిమా సింగ్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక అంశాలపై పట్టు సాధించి స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. మహిళల హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.