News November 19, 2025
రాష్ట్రంలోనే ఏలూరు ప్రథమ స్థానం: సాల్మన్ రాజ్

ఏలూరు జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం కింద ఇప్పటివరకు 1,00,026 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన 31,022 రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను గ్రిడ్‌కు అనుసంధానించినట్లు ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ సాల్మన్ రాజు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఏలూరు జిల్లాలో 4,218 మంది వినియోగదారులు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నారన్నారు. పథకం సమాచారం కోసం 1912కు కాల్ చేయవచ్చని ఆయన సూచించారు.
Similar News
News March 25, 2026
జన్నారం: ఇద్దరు అటవీ అధికారులు సస్పెండ్

కవ్వాల్ టైగర్ జోన్ జన్నారం అటవీ డివిజన్‌లో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారులపై వేటు పడింది. బీట్ ఆఫీసర్ లవన్ కుమార్, డీఆర్‌ఓ కుమారస్వామిని సస్పెండ్ చేసినట్లు ఎఫ్డీఓ రామ్మోహన్ బుధవారం ప్రకటించారు. అటవీ దొంగలకు సహకరించినా, విధుల్లో అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అడవుల సంరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
News March 25, 2026
టీనేజ్ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

అప్పటివరకు సంతోషంగా, చురుగ్గా ఉండే కొందరు పిల్లలు కాలేజీకి వెళ్లగానే సైలెంట్ ఐపోతారు. పిల్లల ప్రవర్తనలో ఇలాంటి మార్పును వెంటనే గుర్తించాలంటున్నారు నిపుణులు. వేధింపులకు గురవుతున్నారేమో పరిశీలించాలి. ఫ్రెండ్లీగా మాట్లాడి సమాచారం రాబట్టాలి. భయాన్ని పోగొట్టి, తామున్నామనే భరోసా, నమ్మకాన్ని తల్లిదండ్రులు కలిగించాలి. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనేలా ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని సూచిస్తున్నారు.
News March 25, 2026
WGL: పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదు: అధికారులు

తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం స్పష్టం చేసిందని ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులు తెలిపారు. సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని చెప్పారు. కొన్ని బంక్‌ల వద్ద కనిపిస్తున్న క్యూలు వదంతుల వల్ల ప్రజలు ఆందోళనగా కొనుగోలు చేయడంతోనే ఏర్పడ్డాయని పేర్కొన్నారు. బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని సూచించారు.


