News November 19, 2025
యాదాద్రి గిరి ప్రదక్షిణకు పటిష్ఠ ఏర్పాట్లు: ఈవో

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా నేడు జరిగే గిరి ప్రదక్షిణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. ప్రదక్షిణ ఉదయం 5:30 గంటలకు కొండ కింద వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలతో ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఈవో కోరారు.
Similar News
News March 21, 2026
నిర్మల్: పర్యావరణానికి అటవీ సంపద ఊపిరి

ఉమ్మడి జిల్లాలో అటవీ విస్తీర్ణం పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లాలో 1,778.26 చ.కి.మీ అడవి ఉండగా, మంచిర్యాల 1,564.93, ఆదిలాబాద్ 1,145.76, నిర్మల్‌లో 1,085.02 చ.కి.మీ విస్తరించి ఉంది. ఈ అటవీ సంపద ప్రాంతీయ జీవవైవిధ్యానికి, వర్షపాత సమతుల్యతకు దోహదపడుతోంది. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటంలో ఈ అడవులు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి.
News March 21, 2026
పిల్లి కోసం ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య

హైదరాబాద్‌లో వేర్వేరు ఘటనల్లో పెంపుడు పిల్లుల కోసం ఇద్దరు విద్యార్థినులు తనువు చాలించడం విస్మయానికి గురిచేస్తోంది. పిల్లిని ఇంట్లోకి తేవొద్దన్నందుకు అల్వాల్‌కు చెందిన MBBS స్టూడెంట్ శ్రేష్ఠ నిన్న తల్లితో గొడవపడి సూసైడ్ చేసుకుంది. 3 రోజుల క్రితం మీర్‌పేట్‌లోనూ BSc విద్యార్థిని హిమబిందు పెంపుడు పిల్లి చనిపోయిందని ఆత్మహత్య చేసుకుంది. పెట్స్‌పై ప్రేమతో ప్రాణాలు తీసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
News March 21, 2026
రైతులకు గుడ్ న్యూస్: రేపటి నుంచే ఖాతాల్లోకి ‘రైతు భరోసా…!

గద్వాల జిల్లా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. యాసంగి సాగుకు సంబంధించి ఎకరానికి రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని ఆదివారం నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. జిల్లాలో తొలి విడతలో 1,69,299 మంది రైతులకు ఒక ఎకర భూమి రైతులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 28 లోపు పాస్‌బుక్కులు పొందిన మరో 6 వేల మందికి కూడా ఈ అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా 3.52 లక్షల ఎకరాలకు ఈ సాయం అందనుంది.


