News November 19, 2025
యువతకు ఉపాధిలో జిల్లా ముందంజ: జేసీ

యువతకు ఉపాధి కల్పించడంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముందంజలో ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి అన్నారు. మంగళవారం అమలాపురంలో కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జేసీ మాట్లాడారు. వికాస ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో 36 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. మొత్తం 267 మంది ఈ జాబ్ మేళాకు హాజరయ్యారని జేసీ తెలిపారు.
Similar News
News March 21, 2026
జగిత్యాల: జీవన్ రెడ్డి అలక వీడేనా?

జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసం వద్ద జరిగిన చర్చలు ఆసక్తి రేపుతున్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చర్చలు జరిపినప్పటికీ జీవన్ రెడ్డి అలక వీడనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఉమ్మడి KNR జిల్లా మంత్రులు బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఒకవైపు అధిష్ఠానం, మరోవైపు స్థానిక నేతల చర్చలు కొనసాగుతుండడంతో జీవన్ రెడ్డి తుది నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.
News March 21, 2026
కాఠిన్యం వెనక కన్నీటి గాథలు.. TG పోలీస్ భావోద్వేగ ట్వీట్

కరీంనగర్ 2 టౌన్ SI చంద్రశేఖర్ సూసైడ్ పట్ల TG పోలీస్ భావోద్వేగ ట్వీట్ చేసింది. ‘ఖాకీ వెనక కఠినత్వమే కాదు చట్టాన్ని కాపాడే కళ్లలో కన్నీటి గాథలూ ఉంటాయి. కర్తవ్యనిష్ఠతో కాలం విసిరే కర్కశత్వ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక.. గద్దరించే గొంతు పలకని మాటల భారంతో నిశ్శబ్దం వైపు పయనించింది’ అంటూ కవిత రూపంలో నివాళులర్పించింది. భార్య దివ్య ఇటీవల ఆత్మహత్య చేసుకోగా తట్టుకోలేక నేడు చంద్రశేఖర్ సూసైడ్ చేసుకున్నారు.
News March 21, 2026
భద్రాద్రికి బడ్జెట్ ‘భరోసా’.. బీమా, విద్యార్థులకు వరం

బడ్జెట్‌లో జిల్లాకు ప్రభుత్వం కీలక కేటాయింపులు చేసింది. రేషన్ కార్డు కలిగిన 3,22,738 కుటుంబాలకు ‘ఇందిరమ్మ జీవిత బీమా’ కింద రూ.5 లక్షల చొప్పున భద్రత కల్పించనున్నారు. విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి, ఇంటర్ చదువుతున్న 4,300 మందికి అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. అలాగే ATCల్లో శిక్షణ పొందుతున్న 688 మందికి నెలకు రూ.2 వేల చొప్పున ఉపకార వేతనం అందనుంది.


