News April 13, 2024
ఆదిలాబాద్ జిల్లాకు కేటీఆర్ రాక..!

ఆత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు కానుక ఇద్దామని బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఈ నెల 16న కేటీఆర్ ఆదిలాబాద్ వస్తున్నారని, కార్యకర్తలు సకాలంలో హాజరై కేటీఆర్ పర్యటన విజయవంతం చేయాలని కోరారు. బోథ్ నియోజకవర్గంలోని 302 బూతుల నుంచి కార్యకర్తలు కష్టపడి 90 వేల ఓట్ల మెజార్టీ ఇవ్వాలన్నారు.
Similar News
News July 9, 2025
ADBలో పర్యటించిన రీజినల్ జాయింట్ డైరెక్టర్

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీలక్ష్మి బాయి బుధవారం ADB జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అంగన్వాడీ కేంద్రాలను, సఖీ కేంద్రం, బాలరక్షక్ భవన్, శిశుగృహను ఆమె సందర్శించారు. రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం సీడీపీఓలు, సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించారు. అంతకుముందు సఖి కేంద్రంలో మొక్కలు నాటారు. జిల్లా సంక్షేమ అధికారి మిల్కా ఉన్నారు.
News July 9, 2025
ADB: ‘సాంకేతిక పద్ధతులతో అధిక దిగుబడులు’

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కోరమండల్ కంపెనీ ఆధ్వర్యంలో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో కలెక్టర్ రాజర్షి షా బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. నానో ఎరువులు మట్టి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాక, పంట దిగుబడుల పెంచుతాయని చెప్పారు. రైతులు సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అధిక దిగుబడులు సాధించాలని పేర్కొన్నారు.
News July 9, 2025
ADB: ఆగస్టు 3న టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ పరీక్ష

టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (లోయర్ గ్రేడ్) రాత పరీక్షను ఆగస్టు 3వ తేదీన నిర్వహిస్తున్నట్లు డీఈవో శ్రీనివాస్‌రెడ్డి బుధవారం తెలిపారు. మే, జూన్ 2025లో నిర్వహించిన 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ కోర్స్‌లో ఫెయిలైన విద్యార్థుల కోసం హైదరాబాద్, హనుమకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో ఆగస్టు 3న పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు.