News November 19, 2025

మంత్రి పొంగులేటి పర్యటన వాయిదా

image

రేపు సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి, కూసుమంచి మండలాల్లో జరగాల్సిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ మార్పును గమనించాలని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి పర్యటన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.

Similar News

News March 31, 2026

ఖమ్మం ఇరిగేషన్ సీఈగా వెంకటేశ్వర్లు బాధ్యతలు

image

ఖమ్మం జిల్లా ఇరిగేషన్ సీఈగా మంగళంపూడి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు సీఈగా పనిచేసిన వెంకటరమేష్ బాబు మంగళవారం ఉద్యోగ విరమణ పొందారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఖమ్మం ఎస్ఈగా కొనసాగుతున్న వెంకటేశ్వర్లకు సీఈగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జీవో విడుదల చేసింది. పదోన్నతి పొందిన ఆయనను ఇరిగేషన్ శాఖ అధికారులు, సిబ్బంది అభినందించారు.

News March 31, 2026

గ్రామసభలు ప్రజాపాలన ప్రతిబింబించేలా నిర్వహించాలి: డిప్యూటీ సీఎం భట్టి

image

రాష్ట్రంలో ప్రజాపాలన ప్రతిబింబించేలా గ్రామసభలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. మంగళవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 2న జరిగే సభల్లో ప్రభుత్వ పథకాల వివరాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొని క్షేత్రస్థాయి సమస్యలను గుర్తించాలని ఆదేశించారు. 99 రోజుల ప్రగతి ప్రణాళిక అమలుపై దిశానిర్దేశం చేశారు.

News March 31, 2026

నేలకొండపల్లి బౌద్ధస్తూపాన్ని అభివృద్ధి చేయాలి: ఖమ్మం ఎంపీ

image

నేలకొండపల్లిలోని చారిత్రక బౌద్ధస్తూపాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. లోక్‌సభలో 377 నిబంధన కింద ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. శాతవాహన కాలం నాటి ఈ కట్టడాన్ని ‘జాతీయ బౌద్ధ పర్యాటక సర్క్యూట్’లో చేర్చాలని డిమాండ్ చేశారు. అక్కడ మ్యూజియం ఏర్పాటుతో పాటు మౌలిక వసతులు కల్పిస్తే విదేశీ పర్యాటకుల రాక పెరుగుతుందని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.