News November 19, 2025
కడప: నడిరోడ్డుపై కొట్లాడుకున్న పోలీసులు

పెండ్లిమర్రి మండలం వెల్లటూరులో మంగళవారం పోలీసుల మధ్య గొడవ జరిగింది. సీఎం చంద్రబాబు పర్యటన బుధవారం జరగనుంది. ఈ క్రమంలో బందోబస్తుగా మంగళవారం వచ్చిన ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ ఓ హోటల్ వద్ద మాట మాట పెరిగి గొడవకు దిగారు. మీరెంత అంటే మీరెంత అంటూ రెండు గ్రూపులుగా విడిపోయిన పోలీసులు నడిరోడ్డుపై కలబడ్డారు. స్థానికులు, తోటి పోలీసులు వారికి సర్ది చెప్పారు. ఈ ఘటనపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.
Similar News
News March 27, 2026
GNT: ‘రీసెర్చ్ నెక్సస్’ జర్నల్ ఆవిష్కరించిన జస్టిస్ రామకృష్ణ ప్రసాద్

వడ్లమూడి విజ్ఞాన్ వర్సిటీలో ‘రీసెర్చ్ నెక్సస్’ జర్నల్‌ను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ ఆవిష్కరించారు. విద్యార్థులు నిజాయతీ, నిబద్ధతతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను సత్కరించారు. కార్యక్రమంలో విజ్ఞాన్ గ్రూప్ ఛైర్మన్ లావు రత్తయ్య, వైస్ ఛైర్మన్ శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

తుళ్లూరు: APCRDA గ్రీవెన్స్ డే వాయిదా

అమరావతి ప్రాంత రైతులు, కూలీల సమస్యల పరిష్కారానికి ప్రతి శనివారం నిర్వహించే గ్రీవెన్స్ డే ఈ నెల 28న జరగదని APCRDA వెల్లడించింది. కొన్ని నిర్వహణ కారణాల వల్ల శనివారం నాటి కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. వాయిదా పడిన ఈ ఫిర్యాదుల పరిష్కార వేదికను మార్చి 30న సోమవారం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాజధాని ప్రాంత ప్రజలు, రైతులు ఈ మార్పును గమనించి సహకరించాలని అధికారులు కోరారు.