News November 19, 2025

అచ్చంపేట: పాము పడుతూ.. స్నేక్ క్యాచర్‌కు కాటు

image

అచ్చంపేట పట్టణం రెడ్డి భవన్ కాలనీ సమీపంలోని ఓ ఇంట్లో రక్తపింజర పాము కనిపించడంతో స్థానికులు స్నేక్ క్యాచర్ సుమన్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న సుమన్ పామును పట్టుకునే ప్రయత్నంలో అనుకోకుండా అతని చేతికి పాము కాటేసింది. తక్షణమే అక్కడున్న వారు సుమన్‌ను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది.

Similar News

News March 13, 2026

పాలమూరు: ఏడాదికి 8 నెలలు నీటిలోనే ఆలయం

image

కొల్లాపూర్(M) సోమశిల కృష్ణానది తీరంలో గల ప్రాచీన సంగమేశ్వర ఆలయ గోపురం భక్తులకు దర్శనమిస్తోంది. ఏడాదిలో సుమారు 8 నెలల పాటు కృష్ణమ్మ ఒడిలో జలధివాసంలో ఉండే ఈ ఆలయం, వరద తగ్గుముఖం పట్టడంతో బయటపడుతోంది. గర్భగుడిలో బురద మట్టి పేరుకుపోయినప్పటికీ వేపధార శివలింగం అలల తాకిడికి చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. ఉగాదిలోపు మొత్తం గుడి పూర్తిగా జలాధివాసం నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంటుందని భక్తులు భావిస్తున్నారు.

News March 13, 2026

భూసంస్కరణలకు నాంది పలికింది ‘మన పాలుమూరు బిడ్డే’

image

బూర్గుల రామకృష్ణారావు ఉమ్మడి పాలమూరు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం పడకల్‌లో 1899 మార్చి 13న జన్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడైన ఆయన తెలంగాణ చరిత్రలో ఓ మహోన్నత వ్యక్తి. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నిక తర్వాత, హైదారాబాద్ రాష్ట్రానికి(అప్పట్లో తెలంగాణ, మరాఠ్వా, కర్ణాటక ప్రాంతాలు కలిపి) ఆయన CMగా ఎన్నికయ్యారు. ఆయన హాయాంలో తీసుకువచ్చిన కౌలుదారీ చట్టం ద్వారా భూసంస్కరణలకు నాంది పలికారు. నేడు ఆయన జయంతి.

News March 13, 2026

పౌల్ట్రీ పరిశ్రమపై వార్ ఎఫెక్ట్.. గుడ్ల ధర పతనం

image

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం దేశీయ పౌల్ట్రీ పరిశ్రమపై పడింది. భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతి కావాల్సిన కోడిగుడ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల పోర్టుల నుంచి కోడి గుడ్ల లోడ్ వెనక్కి రావడంతో పౌల్ట్రీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. యుద్ధానికి ముందు ఒక కోడి గుడ్డు ధర రూ.7 వరకూ ఉండగా.. ప్రస్తుతం అది కొన్నిచోట్ల రూ.4, రూ.3.50కు పడిపోయింది.