News November 19, 2025
అచ్చంపేట: పాము పడుతూ.. స్నేక్ క్యాచర్‌కు కాటు

అచ్చంపేట పట్టణం రెడ్డి భవన్ కాలనీ సమీపంలోని ఓ ఇంట్లో రక్తపింజర పాము కనిపించడంతో స్థానికులు స్నేక్ క్యాచర్ సుమన్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న సుమన్ పామును పట్టుకునే ప్రయత్నంలో అనుకోకుండా అతని చేతికి పాము కాటేసింది. తక్షణమే అక్కడున్న వారు సుమన్‌ను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది.
Similar News
News March 12, 2026
ఎండల తీవ్రత పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలో వేసవి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని, వడగాల్పుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చిన్నారులు, పశువుల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు.
News March 12, 2026
రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు

TG: మండుతున్న ఎండలు, ఉక్కపోతకు ఉపశమనం కలిగించేలా రాష్ట్రంలో 2 రోజులు వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 15, 16 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్, హైదరాబాద్, మేడ్చల్, MBNR జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయని పేర్కొంది. అప్పటివరకు ఎండలు దంచి కొట్టనున్నాయని వెల్లడించింది.
News March 12, 2026
నిర్మల్: ‘ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలి’

ప్రజా ప్రతినిధులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రజా ప్రతినిధులుగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం గొప్ప విషయం అని, నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అంతా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, పరిష్కరించే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు.


