News November 19, 2025
అచ్చంపేట: పాము పడుతూ.. స్నేక్ క్యాచర్‌కు కాటు

అచ్చంపేట పట్టణం రెడ్డి భవన్ కాలనీ సమీపంలోని ఓ ఇంట్లో రక్తపింజర పాము కనిపించడంతో స్థానికులు స్నేక్ క్యాచర్ సుమన్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న సుమన్ పామును పట్టుకునే ప్రయత్నంలో అనుకోకుండా అతని చేతికి పాము కాటేసింది. తక్షణమే అక్కడున్న వారు సుమన్‌ను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది.
Similar News
News March 13, 2026
సంగారెడ్డి జిల్లాకు రూ.2.10 కోట్లు ఎంపీ నిధులు

మెదక్ ఎంపీ రఘునందన్ రావు కృషితో సంగారెడ్డి జిల్లాకు భారీగా ఎంపీ నిధులు మంజూరయ్యాయని బీజేపీ నేత రాజేశ్వర్ రావు దేశ్ పాండే తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద వివిధ మండలాల్లోని 21 సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.2.10 కోట్లు అనుమతి లభించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
News March 13, 2026
చరిత్రలో ఈ రోజు (మార్చి 13)

1899: హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జననం (ఫొటోలో)
1901: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్ మరణం
1926: తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత వి.రామచంద్రరావు జననం
1940: జలియన్ వాలాబాగ్ కారకుడు మైఖేల్ డయ్యర్‌ను ఉద్దమ్ సింగ్ లండన్‌లో హతమార్చాడు
News March 13, 2026
ఖమేనీ భార్య బతికే ఉన్నారు: ఇరాన్ మీడియా

US, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ <<19282331>>ఖమేనీ భార్య<<>> మన్సౌరే ఖోజాస్తే బగెర్జాదేహ్ చనిపోయినట్లు వచ్చిన వార్తలను ఇరానియన్ మీడియా ఖండించింది. ఆమె బతికే ఉన్నారని IRGC అనుబంధ మీడియా సంస్థ ‘ఫార్స్’ న్యూస్ వెల్లడించింది. కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ కూడా తన తొలి అధికారిక ప్రసంగంలో తల్లి మరణించారని ఎక్కడా ప్రస్తావించలేదు.


