News November 19, 2025

అచ్చంపేట: పాము పడుతూ.. స్నేక్ క్యాచర్‌కు కాటు

image

అచ్చంపేట పట్టణం రెడ్డి భవన్ కాలనీ సమీపంలోని ఓ ఇంట్లో రక్తపింజర పాము కనిపించడంతో స్థానికులు స్నేక్ క్యాచర్ సుమన్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న సుమన్ పామును పట్టుకునే ప్రయత్నంలో అనుకోకుండా అతని చేతికి పాము కాటేసింది. తక్షణమే అక్కడున్న వారు సుమన్‌ను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది.

Similar News

News March 20, 2026

నల్గొండ: ఇరుకైన బ్రిడ్జిలు.. ఘోర ప్రమాదాలు

image

కోదాడ-జడ్చర్ల, నల్గొండ-మాచర్ల హైవేలపై ఇరుకైన వంతెనలు, రక్షణ గోడలు లేకపోవడంతో ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. గత నెల హాలియా సమీపంలో జరిగిన లారీ ప్రమాదంలో కొత్తగూడెం దంపతులు మృతి చెందగా, కంపాసాగర్ వద్ద కారు కాల్వలో పడి మరో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస ఘటనలు ప్రయాణికులను వణికిస్తున్నాయి. అధికారులు స్పందించి వంతెనలకు రక్షణ గోడలు నిర్మించి, ప్రమాదాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

News March 20, 2026

ఒక్క రోజే రూ.5,000 తగ్గిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఓ వైపు <<19430821>>బంగారం<<>> ధరలు పెరగ్గా వెండి ధరలు తగ్గాయి. కేజీ సిల్వర్‌పై రూ.5వేలు తగ్గి రూ.2,60,000 పలుకుతోంది. నిన్న కూడా కేజీపై రూ.10,000 తగ్గిన విషయం తెలిసిందే. మొత్తంగా 3 రోజుల్లో కేజీపై రూ.20,000 తగ్గడం గమనార్హం.

News March 20, 2026

గ్యాస్ కొరత లేదు.. ఆందోళన వద్దు: కలెక్టర్

image

జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. సరఫరాపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బుక్ చేసుకున్న నిర్ణీత గడువులోనే సిలిండర్లు నేరుగా ఇంటికే అందుతాయని, ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సిన పని లేదని పేర్కొన్నారు. ఎక్కడా కొరత లేకుండా పకడ్బందీగా పంపిణీ జరుగుతుందని కలెక్టర్ వివరించారు.