News November 19, 2025
గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ భారత్‌కు అప్పగింత

లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా ప్రభుత్వం భారత్‌కు అప్పగించింది. అధికారులు అతడిని ఇండియాకు తీసుకొస్తున్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో అన్మోల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సిద్దిఖీ కొడుకు జీషన్ US కోర్టులో పిటిషన్ వేయడంతో అన్మోల్‌ను భారత్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది.
Similar News
News March 16, 2026
నేటి నుంచి పశువులకు ఫ్రీగా ‘గాలికుంటు’ టీకాలు

AP: రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఏప్రిల్ 29 వరకు పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను ప్రభుత్వం వేయనుంది. ఇందుకోసం 83.70 లక్షల టీకాలను పంపిణీ చేసింది. వెటర్నరీ డాక్టర్లు పాడి రైతుల ఇళ్ల వద్దకే వెళ్లి ఆవులు, గేదెలు, దూడలు, మేకలు, గొర్రెలకు ఈ టీకాలను వేస్తారు. కాలి గెట్టల మధ్య, నోట్లో పుండ్లు, జ్వరం ఈ వ్యాధి లక్షణాలు. సకాలంలో టీకాలు వేయకపోతే పశువులు మరణిస్తాయి.
News March 16, 2026
HYDలోకి డీజిల్ బస్సులకు నో ఎంట్రీ!

TG: హైదరాబాద్‌ను పర్యావరణహితంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా సిటీలోకి జిల్లాల నుంచి డీజిల్ బస్సులు రాకుండా కట్టడి చేయనుంది. ORR చుట్టూ ఆర్టీసీ టెర్మినళ్లను ఏర్పాటు చేసి, అక్కడి నుంచి ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణికులను నగరంలోకి చేరవేయనుంది. HYDలోని డీజిల్ బస్సులనూ జిల్లాలకు తరలించి ఇక్కడ కేవలం ఎలక్ట్రిక్ బస్సులే వాడతామని ఇటీవల సీఎం <<19328203>>రేవంత్<<>> చెప్పిన విషయం తెలిసిందే.
News March 16, 2026
ఇండక్షన్ స్టవ్స్ వాడుతున్నారా?

గ్యాస్ కొరతతో ఇండక్షన్ స్టవ్స్ వాడకం పెరుగుతోంది. వీటిని వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
*స్టీల్, ఐరన్ పాత్రలతో వంట చేసుకోవాలి. రాగి, అల్యూమినియం, గాజు, మట్టి పాత్రలతో సాధ్యం కాదు.
*స్టవ్ లోపల, కంట్రోల్ ప్యానల్‌పై నీళ్లు పడకూడదు.
*స్టవ్ చల్లబడేందుకు కింద ఫ్యాన్ ఉంటుంది. దానికి అడ్డుగా వస్తువులు పెట్టకూడదు.
*పాత్ర ఉంచాకే స్టవ్ ఆన్ చేయాలి. అవసరాన్ని బట్టి హీట్ పెంచాలి.


