News November 19, 2025

KMR: రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండండి: ఎస్పీ

image

కామారెడ్డి జిల్లాలో నెలకొన్న తీవ్రమైన పొగమంచు నేపథ్యంలో వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. తక్కువ వీక్షణ సామర్థ్యం కారణంగా ఎదురు వాహనాలు, పాదచారులు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. పొగమంచు సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని ఎస్పీ హెచ్చరించారు.

Similar News

News March 14, 2026

నెల్లూరు జిల్లాలో పెరిగిన నూనె ధరలు

image

యుద్ధ ప్రభావం సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై చూపుతోంది. ఇప్పటికే గ్యాస్ కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు వంట నూనె ధరలు కలవరపెడుతున్నాయి. పామాయిల్, సన్ ఫ్లవర్ నూనెలు కిలోకు రూ.10 నుంచి 15 రూపాయల మేర పెరిగాయి. నెల్లూరు జిల్లాలో రోజుకు సుమారు 4 లక్షల లీటర్లకు పైగా వంట నూనెల వినియోగం జరుగుతోంది. దేశంలో వంట నూనెలు 60 శాతం దిగుమతులపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.

News March 14, 2026

WGL: వారి కోసం పోలీసుల వేట!

image

గంజాయి స్మగ్లర్ల కోసం పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. WGL కమిషనరేట్‌లో 242 మంది NDPS నిందితులుగా ఉన్నారు. వారి కోసం 3 జోన్ల పరిధిలోని CIల ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి రంగంలోకి దించారు. ఎల్కతుర్తి, గీసుగొండతో పాటు టాస్క్‌ఫోర్సు నుంచి CI, SIలను టీంలుగా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 15 మంది నిందితులను పట్టుకోగా, మిగిలిన వారిని పట్టుకునేందుకు ఇతర రాష్ట్రాల్లో CIలు నిమగ్నమై ఉన్నారు.

News March 14, 2026

మెదక్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం

image

మెదక్ జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 68 కేంద్రాల్లో 11,247 మంది విద్యార్థులు (5,577 బాలురు, 5,670 బాలికలు) పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండటంతో పాటు జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.