News November 19, 2025
అన్నదాత సుఖీభవ పండుగ వాతావరణంలో నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో ఈ నెల 19న ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ వెట్రిసెల్వి మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులను ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించాలని, కార్యక్రమంలో పాల్గొనే రైతులకు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 28, 2026
పాలమూరు:ALERT.. ఏప్రిల్ వస్తోంది..!

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ఏప్రిల్ మొదటి 2 వారాల్లోనే నగరంలో ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరే అవకాశం ఉంది. మధ్యాహ్నం బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, రుమాలు తీసుకెళ్లాలని, నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, అవసరం లేకుండా ఎండలో తిరగకూడదని అధికారులు హెచ్చరించారు. వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News March 28, 2026
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా: వైసీపీ

మంత్రి మండిపల్లి వివాదంలో చిక్కుకున్నారు. నిన్న రాయచోటి కోదండరామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా చెప్పులు వేసుకొని స్వామివారికి పట్టు వస్త్రాలను ఇంటి నుంచి తీసుకెళ్లారు. ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?, చంద్రబాబు చెప్పులతో పూజలు చేయగా లేనిది మంత్రి చెప్పులతో పట్టు వస్త్రాలు సమర్పిస్తే తప్పేమిటి అనుకున్నాడో ఏంటో’ అని వైసీపీ రీట్వీట్ చేసింది.
News March 28, 2026
విశాఖలో రక్తమోడుతున్న రహదారులు

విశాఖ రోడ్లు రక్తమోడుతున్నాయి. జిల్లాలో 2025లో 1,110 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా 340 మంది మృతి చెందారు. లారీలు, ట్యాంకర్ల వల్ల 140 ప్రమాదాల్లో 80 మంది చనిపోగా 104 మంది గాయపడ్డారు. హిట్ అండ్ రన్ కేసులు 43 నమోదై, 25 మంది మృతిచెందగా 26 మందికి గాయాలయ్యాయి. ప్రమాదాలు 4% తగ్గినా మరణాలు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్యే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.


