News November 19, 2025

KMR: రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండండి: ఎస్పీ

image

కామారెడ్డి జిల్లాలో నెలకొన్న తీవ్రమైన పొగమంచు నేపథ్యంలో వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. తక్కువ వీక్షణ సామర్థ్యం కారణంగా ఎదురు వాహనాలు, పాదచారులు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. పొగమంచు సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని ఎస్పీ హెచ్చరించారు.

Similar News

News April 2, 2026

ఈ వార్తలూ చదవండి..

image

⬇ గదతో గంభీరంగా నిలబడ్డ రామ్.. ఫొటో రిలీజ్!
⬇ క్రికెట్‌కు సౌతాఫ్రికా ప్లేయర్ గుడ్‌బై
⬇ చిరు ఇంట హనుమాన్‌ను తాకిన సూర్యకిరణాలు(VIDEO)
⬇ ట్రెడిషనల్ పనికి టెక్నాలజీ తోడు.. ఆనంద్ ప్రశంస
⬇ జగన్ ‘మావిగన్’పై చంద్రబాబు రియాక్షన్ ఇదే..
⬇ సచిన్ స్పెషల్ వీడియో
⬇ ‘రామాయణ’ టీజర్.. రాముడి లుక్ రివీల్!
⬇ VIDEO: ట్రంప్‌ను ఏసుక్రీస్తుతో పోల్చిన పాస్టర్
⬇ KKRvsSRH: ఓటమి కసితో బరిలోకి!

News April 2, 2026

గదతో గంభీరంగా నిలబడ్డ రామ్.. ఫొటో రిలీజ్!

image

హనుమాన్ జయంతి సందర్భంగా ‘పెద్ది’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. కుస్తీ పోటీలో గదతో హీరో రామ్ చరణ్ గంభీరంగా నిలబడిన ఫొటోను మేకర్స్ షేర్ చేశారు. ఈ సందర్భంగా చరణ్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పటికే రిలీజైన పెహల్వాన్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచగా.. తాజాగా రిలీజైన ఈ స్టిల్ ఆకట్టుకుంటోంది. ఈ లుక్ ఎలా ఉందో COMMENT చేయండి.

News April 2, 2026

ఇలా నవ్వడమూ ఓ జబ్బే..!

image

కారణం లేకుండా, సంతోషం కలగకున్నా నవ్వే ఓ జబ్బు ఉందని మీకు తెలుసా? ‘లాఫింగ్ ఎపిలెప్సీ’ అనే అరుదైన వ్యాధితో రోగులు ఆపుకోలేనంతగా నవ్వుతూ ఫిట్స్ బారిన పడతారు. ఇటీవల AIIMS జోధ్‌పూర్ ఈ వ్యాధి చికిత్సలో విజయం సాధించింది. ‘మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ’ ద్వారా రోగులకు శాశ్వత పరిష్కారం అందించింది. మెదడులోని ‘హైపోథాలమస్’భాగంలో ఏర్పడే హైపోథాలమిక్ హమార్టోమా అనే చిన్న గడ్డ వల్ల నియంత్రణ లేకుండా నవ్వుతుంటారు.